Rave parties: మారిన అడ్డా.. సిటీ నుంచి శివార్లకు..
ABN, Publish Date - Oct 29 , 2024 | 08:46 AM
నగర శివారు ప్రాంతాల ఫామ్ హౌజ్(Farm house)లు డ్రగ్స్, రేవ్ పార్టీలకు అడ్డాగా మారుతున్నాయి. మాదక ద్రవ్యాలపై తెలంగాణ నార్కోటిక్ బ్యూరో, హైదరాబాద్ నార్కోటిక్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్(హెచ్ న్యూ), ఎస్‌వోటీ, టాస్క్‌ఫోర్స్, లా అండ్ ఆర్డర్ పోలీసులు ఉక్కుపాదం మోపుతుండడంతో గతంలో మాదిరిగా నగరంలో డ్రగ్స్ పార్టీలు, రేవ్ పార్టీలు నిర్వహించడానికి నిర్వాహకులు జంకుతున్నారు. దాంతో తమ అడ్డాలను నగర శివారు ఫామ్‌హౌజ్‌లకు మార్చుతున్నారు.
- గుట్టుగా రేవ్ పార్టీలు, పేకాట స్థావరాల నిర్వహణ
- యువతులతో అశ్లీల నృత్యాలు.. మద్యం మత్తులో చిందులు
- పోలీసుల కళ్లుగప్పి డ్రగ్స్ వినియోగం
- నిర్వాహకుల్లో సంపన్నులు, బడాబాబుల పిల్లలు
- ఆటకట్టిస్తున్నా.. ఆగని మత్తు దందా
హైదరాబాద్ సిటీ: నగర శివారు ప్రాంతాల ఫామ్ హౌజ్(Farm house)లు డ్రగ్స్, రేవ్ పార్టీలకు అడ్డాగా మారుతున్నాయి. మాదక ద్రవ్యాలపై తెలంగాణ నార్కోటిక్ బ్యూరో, హైదరాబాద్ నార్కోటిక్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్(హెచ్ న్యూ), ఎస్‌వోటీ, టాస్క్‌ఫోర్స్, లా అండ్ ఆర్డర్ పోలీసులు ఉక్కుపాదం మోపుతుండడంతో గతంలో మాదిరిగా నగరంలో డ్రగ్స్ పార్టీలు, రేవ్ పార్టీలు నిర్వహించడానికి నిర్వాహకులు జంకుతున్నారు. దాంతో తమ అడ్డాలను నగర శివారు ఫామ్‌హౌజ్‌లకు మార్చుతున్నారు. అక్కడ పార్టీలతో పాటు, పేకాట స్థావరాలు, దేశ విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న ఖరీదైన మద్యంతో యువతులతో పార్టీలు నిర్వహిస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఫామ్‌హౌస్‌లు, గెస్టుహౌస్‌లపై దాడులు చేయడానికి సిద్ధమవుతున్నారు.
ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: రంగారెడ్డి కలెక్టర్‌గా నారాయణరెడ్డి
- సైబరాబాద్‌లో వరుస దాడులు..
పోలీసుల కంటపడకుండా ఉండటానికి, నిర్వాహకులు కొత్త కొత్త ఎత్తులను ఉపయోగిస్తున్నారు. ఇప్పటి వరకు స్టార్ హోటళ్లు, లాడ్జీలు, ఇళ్లలో జరిగే ఈ అనైతిక దందాను ఇప్పుడు కొన్ని ముఠాలు ఫామ్‌హౌస్‌లు, గెస్ట్‌హౌస్‌లకు(Farmhouses, Guest House) మార్చాయి. కస్టమర్స్ కోరిక మేరకు, పోలీసుల నుంచి తప్పించుకోవడానికి నగర శివారు ప్రాంతాల్లోని ఫామ్‌హౌస్‌లు, గెస్ట్‌హౌస్‌లను అడ్డాగా మార్చుకుంటున్నారు.
గతేడాది సైబరాబాద్ ఏహెచ్‌టీయూ (యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్) పోలీసులు శివారు ప్రాంతాల ఫామ్‌హౌజ్‌లపై నజర్ పెట్టారు. కొన్ని ఫామ్‌హౌజ్‌లలో రేవ్‌పార్టీలతో పాటు.. ముజ్రాపార్టీలు, అశ్లీల నృత్యాలతో.. వ్యభిచార దందా, పేకాట, క్యాసినో వంటివి నిర్వహిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. పోలీసుల దాడులు ముమ్మరం కావడంతో కొద్దిరోజులు స్తబ్దుగా ఉన్న నిర్వాహకులు తిరిగి గుట్టుచప్పుడు కాకుండా అదే దందా కొనసాగిస్తున్నట్లు అనుమానిస్తున్నారు.
అంతా ఆన్‌లైన్‌లోనే..
ఇతర ప్రాంతాల నుంచి బ్రోకర్స్ ద్వారా యువతులను నగరానికి రప్పిస్తున్న ముఠా వారి ఫొటోలను మీడియేటర్ల ద్వారా ముందుగా ఆర్గనైజర్స్‌కు పంపుతారు. ఫొటోలు సెలక్ట్ చేసుకున్న ఆర్గనైజర్స్ వారిని ఆయా ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకుంటారు. అనంతరం ఆన్‌లైన్‌లో ఫొటోలు చూసిన కస్టమర్స్ యువతులను బుక్ చేసుకున్న తర్వాత బేరం కుదుర్చుకొని పార్టీలకు వెళ్తున్న సందర్భాలు ఉన్నాయి.
కొంతమంది నిర్వాహకులు మాత్రం పార్టీకి వచ్చిన ఆహూతులను ఆకర్శించడానికి యువతులను ఎరగా వేసి అర్ధనగ్న ప్రదర్శనలు, అశ్లీల నృత్యాలతో మద్యం, మాదక ద్రవ్యాల మత్తులో చిల్ చేస్తున్నారు. ఒకవైపు పోలీసులు దాడులు జరుపుతున్నా.. నిందితులను అరెస్టు చేసి కటకటాల్లోకి నెడుతున్నా.. ఈ అశ్లీల మత్తు దందాకు మాత్రం అడ్డుకట్ట పడటంలేదు.
ఈవార్తను కూడా చదవండి: Food Poisoning: వామ్మో.. మోమోస్!
ఈవార్తను కూడా చదవండి: KTR: బుచ్చమ్మది.. రేవంత్ చేసిన హత్య
ఈవార్తను కూడా చదవండి: Madhuranagar: ‘ధరణి’తో మా ప్లాట్ల కబ్జా
ఈవార్తను కూడా చదవండి: Kaleshwaram Project: మేడిగడ్డతో ముంపు
Read Latest Telangana News and National News
Updated Date - Oct 29 , 2024 | 08:46 AM