Flood relief: సీఎంఆర్‌ఎఫ్‌కు రిలయన్స్ విరాళం రూ.20కోట్లు
ABN, Publish Date - Sep 28 , 2024 | 03:41 AM
వరద బాధితుల సహాయార్థం రిలయన్స్ ఫౌండేషన్ రూ.20కోట్ల విరాళాన్ని ప్రకటించింది.
రూ.కోటి చెక్కు అందజేసిన భారత్ బయోటెక్ జేఎండీ
హైదరాబాద్, సెప్టెంబరు 27 (ఆంధ్రజ్యోతి): వరద బాధితుల సహాయార్థం రిలయన్స్ ఫౌండేషన్ రూ.20కోట్ల విరాళాన్ని ప్రకటించింది. సంబంధిత చెక్కును రిలయన్స్ ఫౌంఢేషన్ ఛైర్‌పర్సన్ నీతా అంబానీ తరపున ఆ సంస్థ ప్రతినిధులు శుక్రవారం సీఎం రేవంత్‌రెడ్డిని జూబ్లీహిల్స్‌లోని నివాసంలో కలిసి అందజేశారు.
వీరి వెంట మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఉన్నారు. కాగా, భారత్ బయోటెక్ తరపున సంస్థ కో ఫౌండర్, జాయింట్ మేనేజింగ్ డైరక్టర్ సుచిత్ర ఎల్ల సీఎం రేవంత్‌ను కలిసి రూ.కోటి చెక్కును అందజేశారు. కాగా, సీఎం రేవంత్‌రెడ్డిని జపాన్ కాన్సుల్ జనరల్ టకాహషి మునియో సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు.
Updated Date - Sep 28 , 2024 | 03:41 AM