ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ABN Effect: ఏబీఎన్ ఎఫెక్ట్‌.. యాదగిరిగుట్ట ఆలయంలో మరమ్మతు పనులు షురూ

ABN, Publish Date - Nov 07 , 2024 | 01:07 PM

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయం దక్షిణ భాగంలోని తిరువీధుల్లో ప్రాకార మండపం వెలుపల ఉన్న ఫ్లోరింగ్‌ కుంగిపోయిన విషయాన్ని ఏబీఎన్ వెలుగులోకి తీసుకొచ్చింది. 50 మీటర్ల మేర ఫ్లోరింగ్‌ రెండు అంగుళాల వరకు కుంగింది. ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఎఫెక్ట్‌తో ఆలయ యంత్రాంగం స్పందించింది.

ABN File Photo

యాదగిరిగుట్ట: తెలంగాణ తిరుపతిగా విరాజిల్లుతున్న యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ నిర్మాణంలో నాణ్యతా లోపాలు ఒక్కొక్కటిగా బయట పడుతున్నాయి. తాజాగా ‘యాదగిరిగుట్ట ఆలయంలో కుంగిన ఫ్లోరింగ్‌!’ అంటూ ఏబీఎన్-ఆంధ్రజ్యోతి వెలుగులోకి తీసుకురావడంతో సంబంధిత అధికారయంత్రాంగంలో చలనం మొదలైంది. ఆలయంలో మరమ్మతులు మొదలయ్యాయి. దక్షిణ రాజగోపురం ప్రాకార మండపం వెంట మాడవీధుల్లో కుంగిన ప్రదేశంలో వైటీడీఏ అధికారులు మరమ్మతులు చేపట్టారు. దక్షిణ రాజగోపురం మాఢ వీధిని ఆలయ సిబ్బంది శుభ్రం చేశారు. కాగా 50 మీటర్ల పొడవున మూడు ఇంచుల మేర ఫ్లోరింగ్ కుంగిన విషయాన్ని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి వెలుగులోకి తెచ్చింది. రిటైనింగ్ వాల్ దెబ్బతినకుండా ఏబీఎన్ చేసిన ప్రయత్నాన్ని భక్తులు అభినందిస్తున్నారు.


ఏబీఎన్ కథనం ఇదే..

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయం దక్షిణ భాగంలోని తిరువీధుల్లో ప్రాకార మండపం వెలుపల ఉన్న ఫ్లోరింగ్‌ కుంగిపోయిన విషయాన్ని ఏబీఎన్ వెలుగులోకి తీసుకొచ్చింది. 50 మీటర్ల మేర ఫ్లోరింగ్‌ రెండు అంగుళాల వరకు కుంగింది. అయితే కుంగుబాటుతో ప్రధానాలయానికి ఎలాంటి ప్రమాదం లేదని ఆలయ అధికారులు తెలిపారు. కాగా గత ప్రభుత్వం 2016లో ఆలయ ఉద్ఘాటన చేయాలని నిర్ణయించింది. ప్రధానాలయం పునర్నిర్మాణంతో పాటు ఆలయ విస్తరణకు దాదాపు రూ.1,300 కోట్ల వ్యయంతో పనులు చేపట్టారు. ఆరేళ్ల పాటు ఈ పనులు కొనసాగాయి. 2022 మార్చి 28న ఉద్ఘాటన జరిగింది. ఆలయం పునర్నిర్మాణానికి ముందు 1.20 ఎకరాలు ఉన్న కొండను పూర్తిగా చదును చేయడంతో ప్రధానాలయ ప్రాంగణం 4.20 ఎకరాలకు చేరింది.


ఈ ప్రాంగణంలో స్వామివారి ప్రధానాలయంతో పాటు సప్తగోపురాలను నిర్మించారు. ఆలయం దక్షిణ భాగంలోని ప్రాకార మండపంలో వేసవిలో భక్తుల కాళ్ల కింద వాడిన మ్యాట్లు, వంట చెరకు వేయడంతో చెత్త పేరుకుపోయింది. దీనికి తోడు ఇసుక నిండిపోయి కోతులకు ఆవాసంగా మారింది. అదేవిధంగా రిటైనింగ్‌ వాల్‌కు ఒక చోట బండలు ఊడిపోయాయి. ఆలయ పునర్మిర్నాణంలో దక్షిణ భాగంలో మట్టితో విస్తరించగా ప్రాకార మండపం వెలుపల ఉన్న ఫ్లోరింగ్‌ (నల్లరాతి శిలలు) సుమారు 50 మీటర్ల పొడవున రెండు అంగుళాల లోతుకు కుంగింది. విస్తరణ సమయంలోనూ ఇదే ప్రదేశంలో కుంగిపోగా అప్పట్లో మరమ్మతులు చేపట్టారు. మళ్లీ అక్కడే కుంగి కొన్ని నాపరాళ్లు పగిలిపోయాయి.

Updated Date - Nov 07 , 2024 | 02:08 PM