Revanth Reddy: ఈ ఎన్నికల్లో బీజేపీకి కర్రుకాల్చి వాత పెట్టండి
ABN, Publish Date - May 04 , 2024 | 08:30 PM
రాష్ట్రానికి గాడిద గుడ్డు ఇచ్చిన బీజేపీకి ఈ ఎన్నికల్లో కర్రుకాల్చి వాత పెట్టాలని తెలంగాణ ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. కొత్తకోటలో కార్నర్ మీటింగ్‌లో సిఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు.
వనపర్తి, మే 04: రాష్ట్రానికి గాడిద గుడ్డు ఇచ్చిన బీజేపీకి ఈ ఎన్నికల్లో కర్రుకాల్చి వాత పెట్టాలని తెలంగాణ ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం కొత్తకోటలో కార్నర్ మీటింగ్‌లో సిఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు.
AP Elections: చెల్లెళ్లు వెనుక చంద్రబాబు ఉన్నాడా? అంటే.. జగన్ ఇచ్చిన జవాబు
గజ్వేల్ కేడి, డిల్లీ మోడీ వచ్చినా పాలమూరులో మూడు రంగుల జెండా ఎగరేస్తామని రేవంత్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు జైపాల్ రెడ్డి, మల్లు అనంతరాములు, మహేంద్రానాథ్‌లకు రాని ముఖ్యమంత్రి పదవి.. అవకాశం తనకు వచ్చాయన్నారు.
Chandrababu: వందకు వెయ్యి శాతం.. కేంద్రంలో.. రాష్ట్రంలో ఎన్డీయేనే..!!
70 ఏళ్ల అనంతరం పాలమూరు ప్రాంత బిడ్డి ముఖ్యమంత్రి అయితే.. 150 రోజులు కూడా కాక ముందే కాకులు, గద్దల తనను పొడుస్తూ సిఎం పదవి నుంచి దిగిపోవాలంటున్నారంటూ కారు పార్టీ నేతలపై రేవంత్ మండిపడ్డారు.
AP Elections: ఏపీలో మోదీ ఎన్నికల ప్రచారం.. ఎక్కడ చూసినా ఇదే చర్చ..!!
ఇక కాంగ్రెస్ పార్టీలో డీకే అరుణ ఎన్నో పదవులు పొందారని ఈ సందర్బంగా గుర్తు చేశారు. ప్రస్తుతం ప్రధాని మోడి చేతిలో చురకత్తి అయి.. కాంగ్రెస్ పార్టీని ఓడించేందుకు సిద్దమైందని ఆరోపించారు. పాలమూరు అభివృద్దికి పాటుపడుతున్న తనను అరెస్టు చేయించేందుకు డిల్లిలో కేంద్ర మంత్రి అమిత్ షాతో కుమ్మక్కై కేసులు పెట్టించే కుట్రకు డీకే అరుణ యత్నించిందని విమర్శించారు. ఢిల్లీ దొంగలకు డీకే అరుణ సద్దులు మోస్తుందన్నారు.
Pawan Kalyan: ఏపీ ఎన్నికల్లో పవన్ కల్యాణ్ కింగ్ మేకర్ కానున్నారా..?
గద్వాలలో అక్రమ వ్యాపారాలు చేసిన డీకే అరుణ వంటి నేతలు మనకు అవసరమా..? అని పాలమూరు ప్రజలను ఈ సందర్భంగా రేవంత్ ప్రశ్నించారు. మే 9వ తేదీన 7,500 కోట్లు రైతు భరోసా నగదు వేసి రైతులను ఆదుకుంటామన్నారు. కురుమూర్తి సాక్షిగా చెప్తున్నా ఆగస్టు 15వ తేదీలోగా రూ. 2 లక్షల రుణమాఫి చేసి పాలమూరు రైతుల రుణం తీర్చుకుంటానన్నారు.
Teachers Fighting: స్కూల్లో టీచర్, ప్రిన్సిపల్ డిష్యూం.. డిష్యూం
రుణమాఫీ చెయ్యకపోతే ఈ సీఎం పదవే వృధా అని ఆయన పునరుద్ఘాటించారు. పంద్రాగాస్టు నాడు రుణమాఫి చేసి తీరుతా... రాజీనామా లేఖ సిద్దంగా పెట్టుకో అంటూ హరీష్‌రావుకు రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు.
Read National News and Telugu News
Updated Date - May 04 , 2024 | 08:30 PM