ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

JAC: రెవెన్యూ శాఖ పునరుద్ధరణలో భాగస్వాములవుతాం: ఉద్యోగుల జేఏసీ

ABN, Publish Date - Dec 09 , 2024 | 03:56 AM

రాష్ట్రంలో చిన్నాభిన్నమైన రెవెన్యూ వ్యవస్థను పునరుద్ధరించేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నంలో రెవెన్యూ ఉద్యోగులందరం భాగస్వాములమవుతామని ఉద్యోగుల జేఏసీ చైర్మన్‌ వి.లచ్చిరెడ్డి తెలిపారు.

హైదరాబాద్‌, డిసెంబరు 8 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో చిన్నాభిన్నమైన రెవెన్యూ వ్యవస్థను పునరుద్ధరించేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నంలో రెవెన్యూ ఉద్యోగులందరం భాగస్వాములమవుతామని ఉద్యోగుల జేఏసీ చైర్మన్‌ వి.లచ్చిరెడ్డి తెలిపారు. ఆదివారం హైదరాబాద్‌లో నిర్వహించిన ఉద్యోగ సంఘాల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వం గ్రామస్థాయి రెవెన్యూ వ్యవస్థను ఎత్తివేయడంతో అది నిర్వీర్యమైందని, కాంగ్రెస్‌ ప్రభుత్వం మళ్లీ గ్రామ రెవెన్యూ వ్యవస్థను పునరుద్ధరణ చేయడాన్ని స్వాగతిస్తున్నామన్నారు.


తెలంగాణ ఉద్యమ సమయంలో రెవెన్యూ ఉద్యోగులను భాగస్వాములను చేయాలనే ఉద్దేశంతో తెలంగాణ రెవెన్యూ సర్వీసెస్‌ సంఘాన్ని (టీజీఆర్‌ఎ్‌సఏ) ఏర్పాటు చేశామని, ఇందులో ఇప్పుడు అన్ని స్థాయిల్లో పని చేసే రెవెన్యూ ఉద్యోగులను కలుపుతున్నామన్నారు. ఉద్యోగులను ఐక్యం చేసి సమస్యల పరిష్కారానికి ఇది పని చేస్తుందని తెలిపారు. టీజీఆర్‌ఎ్‌సఏ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన బాణాల రాంరెడ్డి మాట్లాడుతూ.. రెవెన్యూశాఖలో క్షేత్రస్థాయిలో పనిచేసే సిబ్బంది తగ్గిపోయారన్నారు. టీజీఆర్‌ఎ్‌సఏ నూతన కమిటీని ఎన్నుకున్నారు. ప్రధాన కార్యదర్శిగా భిక్షం ఎన్నికయ్యారు.

Updated Date - Dec 09 , 2024 | 03:56 AM