ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Land Regularization: ఎల్‌ఆర్‌ఎస్‌ దళారులకు తావివ్వొద్దు..

ABN, Publish Date - Aug 04 , 2024 | 03:29 AM

లక్షలాది కుటుంబాలకు ప్రయోజనం చేకూర్చే లేఅవుట్‌ రెగ్యులరైజేషన్‌ (ఎల్‌ఆర్‌ఎస్‌) ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్లను రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి ఆదేశించారు.

  • ప్రభుత్వ ఆస్తులకు నష్టం జరగనివ్వొద్దు

  • మూడు నెలల్లో ప్రక్రియ పూర్తి చేయాలి

  • ఎల్‌ఆర్‌ఎస్‌పై కలెక్టర్లకు పొంగులేటి ఆదేశం

  • ప్రభుత్వ ఆస్తులకు నష్టం జరగనివ్వొద్దు.. 3 నెలల్లో ప్రక్రియ పూర్తి చేయాలి: పొంగులేటి

  • మార్గదర్శకాలకు అనుగుణంగా ఎల్‌ఆర్‌ఎస్‌.. ప్రభుత్వ స్థలాలకు నష్టం జరగొద్దు: భట్టి

హైదరాబాద్‌/భూపాలపల్లి/కూసుమంచి/ఖమ్మం, ఆగస్టు 3 (ఆంధ్రజ్యోతి): లక్షలాది కుటుంబాలకు ప్రయోజనం చేకూర్చే లేఅవుట్‌ రెగ్యులరైజేషన్‌ (ఎల్‌ఆర్‌ఎస్‌) ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్లను రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి ఆదేశించారు. నిబంధనల ప్రకారం మాత్రమే భూముల క్రమబద్ధీకరణ జరగాలని, ఎలాంటి అక్రమాలకు తావులేకుండా ఎల్‌ఆర్‌ఎస్‌ ప్రక్రియను మూడు నెలల్లో పూర్తి చేయాలని అన్నారు. మధ్యవర్తులు, దళారుల ప్రమేయం లేకుండా, సాధారణ ప్రజానీకానికి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ ప్రక్రియలో ప్రభుత్వ భూములు ప్రైవేట్‌ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.


ప్రస్తుతం అమల్లో ఉన్న ధరణి పోర్టల్‌ను అప్పటి సీఎం కేసీఆర్‌, సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ కలిసి రూపొందించారని, అది సమస్యలకు కేంద్ర బిందువుగా మారిందని అన్నారు. ఫలితంగా లక్షల మంది రైతులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. రైతుల సమస్యలు పరిష్కరించేలా భూ యజమానులకు అనువుగా, రాష్ట్రానికి రోల్‌ మోడల్‌గా ఉండేలా కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకొస్తున్నామని తెలిపారు. ఈ మేరకు 16 రాష్ట్రాల్లో అమల్లో ఉన్న చట్టాలను అధ్యయనం చేస్తామని చెప్పారు. శనివారం భూపాలపల్లి నుంచి జిల్లా కలెక్టర్లతో మంత్రి పొంగులేటి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. అనంతరం ఖమ్మం జిల్లా పాలేరు జలాశయం నుంచి పాత కాలువకు, భక్త రామదాసు ప్రాజెక్టులోంచి పాలేరు ఆయకట్టుకు సాగర్‌ జలాలను విడుదల చేసిన సందర్భంగా పొంగులేటి మాట్లాడారు.


  • అత్యంత ప్రాధాన్య క్రమంలో పరిష్కరించాలి

గత ప్రభుత్వం 2020లో ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తులను స్వీకరించగా 25.70 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారని, కానీ.. నాలుగేళ్లుగా అవి పరిష్కారానికి నోచుకోలేదని మంత్రి పొంగులేటి తెలిపారు. వాటిని అత్యంత ప్రాధాన్యంక్రమంలో పరిష్కరించాలని కలెక్టర్లకు సూచించారు. ఇందుకోసం జిల్లాల్లో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసుకోవాలని, సిబ్బంది కొరత ఉంటే ఇతర శాఖల నుంచి డిప్యుటేషన్‌పై తీసుకోవాలని అన్నారు. జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, మునిసిపాలిటీలు మినహా.. మిగిలిన ప్రాంతాల దరఖాస్తులను జిల్లా కలెక్టర్లు పర్యవేక్షిస్తారని తెలిపారు. హెచ్‌ఎండీఏ పరిధిలో ఉన్న ఏడు జిల్లాల్లో అత్యంత విలువైన భూములు ఉన్నాయని, ఈ జిల్లాల్లో లేఅవుట్‌ క్రమబద్ధీకరణ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.


ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ద్వారా రాష్ట్రంలోని పట్టణ, గ్రామీణ ప్రాంతాలలో ప్రణాళికాబద్ధమైన, స్థిరమైన అభివృద్ధిని ప్రోత్సహిస్తున్నామన్నారు. ప్రజల ఆస్తులకు చట్టపరమైన గుర్తింపుతో సహా ఆమోదించిన లేఅవుట్ల ద్వారా అభివృద్ధిని ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. ఆమోదించిన లే అవుట్‌ యజమానులకు ఇంటి నిర్మాణాలకు అనుమతులు పొందేందుకు, బ్యాంకు రుణాలు పొందేందుకు, కొనుగోలు చేయడానికి, విక్రయించడానికి వెసులుబాటు కలుగుతుందన్నారు. కాగా స్థలాల క్రమబద్ధీకరణ కోసం చేపట్టిన ఎల్‌ఆర్‌ఎస్‌ ప్రక్రియను.. నిర్దేశిత మార్గదర్శకాల ప్రకారం పూర్తిచేయాలని ఖమ్మంలో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లాల కలెక్టర్లను డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క ఆదేశించారు. ఎల్‌ఆర్‌ఎస్‌ ప్రక్రియ ద్వారా ప్రభుత్వ భూములకు ఎక్కడా నష్టం జరగొద్దన్నారు.

Updated Date - Aug 04 , 2024 | 03:29 AM

Advertising
Advertising
<