ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

గోల్కొండ కోట- కుతుబ్‌షాహీ టూంబ్స్‌ సందర్శనకు రోప్‌వే!

ABN, Publish Date - Nov 13 , 2024 | 05:25 AM

కుతుబ్‌షాహీల వాస్తు నిర్మాణాలకు నిలువుటద్దం గోల్కొండ కోట, దానికి సమీపంలోని పాదుషాల స్మృతి సౌధాల నిర్మాణాలను సందర్శించే పర్యాటకుల కోసం రోప్‌వేను నిర్మించనున్నారు.

  • సాంకేతిక నిపుణుల బృందంతో కలిసి పరిశీలించిన పర్యాటక సంస్థ ఎండీ ప్రకాశ్‌రెడ్డి

హైదరాబాద్‌, నవంబర్‌ 12 (ఆంధ్రజ్యోతి) : కుతుబ్‌షాహీల వాస్తు నిర్మాణాలకు నిలువుటద్దం గోల్కొండ కోట, దానికి సమీపంలోని పాదుషాల స్మృతి సౌధాల నిర్మాణాలను సందర్శించే పర్యాటకుల కోసం రోప్‌వేను నిర్మించనున్నారు. కేంద్ర పురావస్తు శాఖ పర్యవేక్షణలోని గోల్కొండ కోటపై భాగంలోని పలు పురాతన రాజమందిరాలు, రాణివాసాలు, సైనిక స్థావరాలు, ఆయుధగారాలు, మసీదులు, మండపాలు, ధాన్యాగారాలు, గుర్రపు శాలల అద్భుత వాస్తు నిర్మాణాలు ఇప్పటికీ సందర్శకులను ఆశ్చర్యపరుస్తున్నాయి. కోట బురుజులు, ద్వారాలు, రహస్య మందిరాలను పరిశీలించేందుకు సుమారు సుమారు 380 రాతి మెట్లపై నుంచి మీదికి చేరుకోవలిసి ఉంటుంది. అయితే పలువురు పర్యాటకులు కాలి నడకను మెట్లు ఎక్కలేక నిరాశతో వెనుదిరుగుతున్నారు. అన్ని వయసుల పర్యాటకులు గోల్కొండ కోట చారిత్రాత్మక నిర్మాణాలను సాకర్యవంతంగా పరిశీలించేందుకు వీలుగా పర్యాటక సంస్థ రోప్‌వేను నిర్మించాలని నిర్ణయించింది.

ఈ మేరకు రాష్ట్రపర్యాటక అభివృద్ధి సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ప్రకాశ్‌రెడ్డి, హెచ్‌ఎండీఏ అధికారులు, సాంకేతిక నిపుణులతో కలిసి రోప్‌వే నిర్మించనున్న గోల్కొండ కోట, కుతుబ్‌షాహి పాదుషాల స్మృతి సౌఽధాలు, ఉద్యాన వనం ప్రాంతాలను పరిశీలించారు. గోల్కొండ కోట- సమాధుల నిర్మాణాలను అనుసంధానం చేస్తూ రోప్‌వే నిర్మాణం చేపట్టే ప్రదేశాలపై నిపుణులతో చర్చించారు. ఇప్పటికే పర్యాటక సంస్థ భువన గిరి కోటను సందర్శించేందుకు కేంద్ర ప్రభుత్వ సహకారంతో రోప్‌ వే నిర్మాణ పనులు చేపట్టింది. ఈ నేపధ్యంలో గోల్కొండ కోట- కుతుబ్‌షా సమాధులను ప్రాంతాలను సందర్శించేందుకు రెండు వైపులా రోప్‌ వేను అభివృద్ధి చేయాలని నిర్ణయించినట్టు పర్యాటక సంస్థ అధికారులు తెలిపారు.

Updated Date - Nov 13 , 2024 | 05:25 AM