ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Telangana Budget: మూసీ నది సుందరీకరణకు బడ్జెట్‌లో రూ.1000 కోట్లు

ABN, First Publish Date - 2024-02-10T13:25:16+05:30

2024-2025 సంవత్సరానికిగాను ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క శాసనసభలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఇదే తొలి బడ్జెట్ కావడం గమనార్హం. ఈ తొలి బడ్జెట్‌ను భట్టి విక్రమార్క ప్రవేశపెట్టారు.

హైదరాబాద్: 2024-2025 సంవత్సరానికిగాను ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క శాసనసభలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. మొత్తం రూ.2,75,891 కోట్లతో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఇందులో రెవెన్యూ వ్యయం రూ.2,01,178 కోట్లు కాగా.. మూలధన వ్యయం రూ.29,669 కోట్లుగా పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఇదే తొలి బడ్జెట్ కావడం గమనార్హం. ఈ తొలి బడ్జెట్‌ను భట్టి విక్రమార్క ప్రవేశపెట్టారు. ఇందులో మూసీన నది సుందరీకరణ, అభివృద్ధికి రూ.1000 కోట్లు కేటాయించారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. మూసీ నది రివర్ ఫ్రంట్ అబ్బివృద్ధిపై సర్కార్ స్పెషల్ ఫోకస్ పెట్టినట్టు తెలిపారు. లండన్ థెమ్స్ నదిలా మూసీ నదిని అభివృద్ధి చేయనున్నట్టు చెప్పారు. పాదచారుల జోన్‌లు, చిల్డ్రన్స్ థీమ్స్ పార్కులు, ఎంటర్ టైన్ మెంట్ జోన్లు ఏర్పాటు చేయనున్నట్టు పేర్కొన్నారు. పర్యావరణ పద్దతిలో మూసి నదిని అభివృద్ధి చేస్తామని భట్టి తెలిపారు.

అలాగే ప్రభుత్వ ఉద్యోగ పరీక్షలను నిర్వహించే టీఎస్‌పీఎస్సీకి బడ్జెట్‌లో రూ.40 కోట్లు కేటాయించినట్టు మంత్రి తెలిపారు. త్వరలోనే మెగా డీఎస్సీ ఉంటుందని మంత్రి చెప్పారు. త్వరలో 15 వేల కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ చేసి, నియామక పత్రాలు ఇస్తామని, గ్రూప్ -1లో 64 ఉద్యోగాలని చేర్చి భర్తీ చేయబోతున్నట్టు భట్టి విక్రమార్క్ తెలిపారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - 2024-02-10T13:26:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising