ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

జగిత్యాల కేంద్రంగా రూ.288 కోట్ల ఐటీసీ కుంభకోణం!

ABN, Publish Date - Oct 14 , 2024 | 05:24 AM

జగిత్యాల కేంద్రంగా వస్తు సేవల పన్ను ఇన్‌పుట్‌ టాక్స్‌ క్రెడిట్‌ (ఐటీసీ) అక్రమాల వ్యవహారంపై ఆ శాఖ ఉన్నతాధికారులు ముమ్మర విచారణ జరుపుతున్నారు. ఐటీసీ అవకతవకలపై సుమారు 9 నెలల క్రితం జగిత్యాలలో సోదాలు నిర్వహించి కేసు నమోదు చేసి ఓ జీఎస్టీ ప్రాక్టిషనర్‌ను అదుపులోకి తీసుకున్న ఉన్నతాధికారులు..ఐటీసీ రికవరీపై దృష్టిపెట్టారు.

  • తొమ్మిది నెలల విచారణలో వెలుగులోకి.. తాజాగా రూ.11 కోట్ల రికవరీ!

జగిత్యాల, అక్టోబరు 13 (ఆంధ్రజ్యోతి): జగిత్యాల కేంద్రంగా వస్తు సేవల పన్ను ఇన్‌పుట్‌ టాక్స్‌ క్రెడిట్‌ (ఐటీసీ) అక్రమాల వ్యవహారంపై ఆ శాఖ ఉన్నతాధికారులు ముమ్మర విచారణ జరుపుతున్నారు. ఐటీసీ అవకతవకలపై సుమారు 9 నెలల క్రితం జగిత్యాలలో సోదాలు నిర్వహించి కేసు నమోదు చేసి ఓ జీఎస్టీ ప్రాక్టిషనర్‌ను అదుపులోకి తీసుకున్న ఉన్నతాధికారులు..ఐటీసీ రికవరీపై దృష్టిపెట్టారు. సదరు ప్రాక్టిషనర్‌ బదలాయించిన ఐటీసీని పొందిన కంపెనీల నుంచి తాజాగా సుమారు రూ.11 కోట్లు రికవరీ చేసినట్లు తెలుస్తోంది. జగిత్యాల కేంద్రంగా సుమారు రూ.288 కోట్ల ఇన్‌పుట్‌ టాక్స్‌ కుంభకోణం జరిపినట్లుగా తాజాగా అధికారులు అనుమానిస్తున్నారు. ఈ వ్యవహారంపై గతేడాది డిసెంబరు రెండోవారంలో అధికారులు జగిత్యాలలో సోదాలు నిర్వహించారు. జగిత్యాలలో జీఎస్టీ ప్రాక్టిషనర్‌గా పనిచేస్తున్న ఓ వ్యక్తిపై అధికారులు కేసు నమోదు చేశారు.

దాదాపు 32 బోగస్‌ కంపెనీలను అతను సృష్టించి అక్రమాలకు పాల్పడ్డట్లుగా అధికారులు గుర్తించారు. కొత్త వ్యాపార సంస్థల ఏర్పాటుకు, వ్యాపార సంస్థల మూసివేతకు పలువురు వ్యాపారులు సదరు ప్రాక్టిషనర్‌ను కలిసేవారు. అలా వచ్చిన వారి నుంచి పాన్‌ కార్డు, ఆధార్‌ కార్డులు సేకరించేవాడని అధికారులు గుర్తించారు. మూసివేయమన్న సంస్థల నిర్వాహకులకు చెందిన పాన్‌ కార్డు, ఆధార్‌ కార్డుల ద్వారా ఫోన్‌ నంబర్లు మార్చి జీఎస్టీ చట్టంలోని లొసుగులను ఆసరాగా చేసుకొని సదరు కంపెనీలను ఆన్‌లైన్‌లో కొనసాగించినట్లుగా అధికారులు విచారణలో గుర్తించారు. క్షేత్ర స్థాయిలో ఎలాంటి వ్యాపార లావాదేవీలు నిర్వహించకుండానే, పేపర్‌పైనే లావాదేవీలు జరిపి బురిడీ కొట్టించాడని అధికారులు అనుమానించారు.


జీఎస్టీ వెబ్‌సైట్‌లో తప్పుడు పత్రాలు అప్‌లోడ్‌ చేయడంతోపాటు 32 బోగస్‌ సంస్థలను తెరిచి వాటి ద్వారా సిమెంట్‌, ఐరన్‌ వ్యాపారం చేసినట్లు చూపించాడు. తన బోగస్‌ సంస్థల ఖాతాల్లో జమైన ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ మొత్తాన్ని ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, ఒడిశా, గుజరాత్‌ రాష్ట్రాలకు చెందిన సుమారు 302 మంది వ్యాపారులకు బదిలీ చేసినట్లుగా అధికారులు గుర్తించినట్లుగా తెలుస్తోంది. ఇందులో రూ.120 కోట్ల ఐటీసీ ఓ బోగస్‌ కంపెనీకి వెళ్లినట్లు అధికారులు గుర్తించారు. మిగతా మొత్తాన్ని హైదరాబాద్‌లోని పంజాగుట్ట, చార్మినార్‌, ఏపీ, కర్ణాటక, మహారాష్ట్రలోని వివిధ కంపెనీలకు బదలాయింపులు జరిగినట్లుగా అధికారులు గుర్తించారు.

దీంతో దాదాపు 150 కంపెనీల ఐటీసీని జీఎస్టీఅధికారులు బ్లాక్‌ చేశారు. ఆయా సంస్థలు ఉపయోగించిన ఐడీలను తమకు ఇవ్వాలని జగిత్యాల జీఎస్టీ అధికారి ఆనంద్‌రావు... డీజీపీ జితేందర్‌కు గత నెలలో లేఖను రాసినట్లు తెలిసింది. ఈ వ్యవహారంలో ఐటీసీ లబ్ధిపొందిన కంపెనీల నుంచి సుమారు రూ.11 కోట్లు రికవరీ చేసినట్లుగా జీఎస్టీ అధికార వర్గాలు చెబుతున్నాయి. మరింత లోతుగా విచారణ జరిపి ఐటీసీని రికవరీ చేయడంపై అధికారులు దృష్టిసారించారు. ఈ విషయమై జగిత్యాల జిల్లా జీఎస్టీ అధికారి ఆనంద్‌రావును సంప్రదించగా ఐటీసీ అక్రమాల వ్యవహారంపై హైదరాబాద్‌ కేంద్రంగా విచారణ జరుగుతోందని తెలిపారు.

Updated Date - Oct 14 , 2024 | 05:24 AM