TG: యాదగిరికొండపై వారాంతపు రద్దీ..
ABN , Publish Date - May 13 , 2024 | 03:50 AM
యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టపై ఆదివారం భక్తుల రద్దీ నెలకొంది. వారాంతపు సెలవు రోజు కావడంతో భక్తులు పెద్దసంఖ్యలో వచ్చి లక్ష్మీనృసింహుడిని దర్శించుకున్నారు. దాదాపు 40వేల మంది భక్తులు క్షేత్ర దర్శనానికి రాగా ప్రత్యేక, ధర్మదర్శన క్యూలైన్లలో ఉదయం నుంచి రాత్రి వరకు రద్దీ కొనసాగింది. వీఐపీ దర్శనానికి రెండు గంటలు, ధర్మదర్శనానికి మూడు గంటల సమయం పట్టింది.
భువనగిరి అర్బన్, మే 12: యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టపై ఆదివారం భక్తుల రద్దీ నెలకొంది. వారాంతపు సెలవు రోజు కావడంతో భక్తులు పెద్దసంఖ్యలో వచ్చి లక్ష్మీనృసింహుడిని దర్శించుకున్నారు. దాదాపు 40వేల మంది భక్తులు క్షేత్ర దర్శనానికి రాగా ప్రత్యేక, ధర్మదర్శన క్యూలైన్లలో ఉదయం నుంచి రాత్రి వరకు రద్దీ కొనసాగింది. వీఐపీ దర్శనానికి రెండు గంటలు, ధర్మదర్శనానికి మూడు గంటల సమయం పట్టింది. ప్రసాద విక్రయశాలల వద్ద కూడా రద్దీ నెలకొంది.
భక్తులను కొండపైకి తరలించేందుకు ఆర్టీసీ అధికారులు ఏర్పాట్లు చేశారు. ఆలయ ఖజానాకు వివిధ విభాగాల ద్వారా రూ. 57,76,291 ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈవో ఏ.భాస్కర్‌రావు తెలిపారు. కాగా, స్వామివారికి నిత్యపూజలను అర్చకస్వాములు శాస్రోక్తంగా నిర్వహించారు.