ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Sangareddy: మూత్రం పోశాడని 30 వేల జరిమానా

ABN, Publish Date - Sep 17 , 2024 | 03:02 AM

మద్యం మత్తులో ఆర్‌అండ్‌బీ విశ్రాంతి గృహ ప్రాంగణంలో మూత్ర విసర్జన చేయడమే కాక, ఇదేమిటని ప్రశ్నించిన శిక్షణ కలెక్టర్‌తో వాగ్వాదానికి దిగిన ఓ డీలర్‌కు రూ.30 వేల జరిమానా పడింది.

  • ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌ వద్ద మూత్ర విసర్జన చేసిన వ్యక్తిపై కఠిన చర్య

  • సంగారెడ్డిలో ఘటన.. ఇకపై కేసులూ

  • పట్టణ వాసులకు శిక్షణ కలెక్టర్‌ హెచ్చరిక

  • బహిరంగ మూత్ర విసర్జన చేస్తే కేసులు..ప్రజలకు సంగారెడ్డి శిక్షణ కలెక్టర్‌ హెచ్చరిక

సంగారెడ్డి క్రైం, సెప్టెంబరు 16: మద్యం మత్తులో ఆర్‌అండ్‌బీ విశ్రాంతి గృహ ప్రాంగణంలో మూత్ర విసర్జన చేయడమే కాక, ఇదేమిటని ప్రశ్నించిన శిక్షణ కలెక్టర్‌తో వాగ్వాదానికి దిగిన ఓ డీలర్‌కు రూ.30 వేల జరిమానా పడింది. సంగారెడ్డి పట్టణంలోని ఆర్‌అండ్‌బీ విశ్రాంతి గృహంలో శిక్షణ కలెక్టర్‌ మనోజ్‌ నివాసముంటున్నారు. ఆదివారం రాత్రి 10 గంటల తర్వాత పట్టణానికి చెందిన ఓ రేషన్‌ డీలర్‌ మద్యం మత్తులో కారులో అక్కడికి వచ్చి విశ్రాంతి గృహ ప్రాంగణంలో మూత్ర విసర్జన చేశాడు.


ఇది గమనించిన శిక్షణ కలెక్టర్‌ మనోజ్‌ అతడిని వారించి.. ఇదేం పని? విశ్రాంతి ప్రాంగణం పాడైపోతుంది కదా? అని ప్రశ్నించారు. దీనికి ఆ డీలర్‌ ‘నా ఇష్టం.. అడగడానికి నీవెవరు?’ అంటూ వాగ్వాదానికి దిగాడు. దీంతో ఆగ్రహించిన శిక్షణ కలెక్టర్‌.. మున్సిపల్‌ అధికారులను పిలిపించి, అతనికి రూ.30 వేలు జరిమానా విధించి, అతడి కారును స్వాధీనం చేసుకున్నారు. పట్టణంలో ఎవరైనా, ఎక్కడైనా బహిరంగంగా మూత్ర విసర్జన చేస్తే జరిమానాలు తప్పవని, అవసరమైతే కేసులు కూడా నమోదు చేస్తామని శిక్షణ కలెక్టర్‌ మనోజ్‌ హెచ్చరించారు.

Updated Date - Sep 17 , 2024 | 03:02 AM

Advertising
Advertising