Mayor: ఫీల్డ్ ఆఫీసర్‌పై సస్పెన్షన్ వేటు
ABN, Publish Date - May 23 , 2024 | 02:25 PM
గాజులరామారంలో ఫీల్డ్ ఆఫీసర్ కిషన్ లీలలు వెలుగులోకి వచ్చాయి. ఓ మహిళ పారిశుద్ద్య సిబ్బందిని లైంగికంగా వేధించిన ఘటన తీవ్ర కలకలం రేపింది. బాధిత మహిళకు సంబంధించిన వీడియోలు కూడా బయటకు వచ్చాయి. దాంతో బాధితురాలు మీడియా ముందుకు వచ్చి జరిగిన మొత్తం చెప్పింది. మహిళను వేధించిన ఫీల్డ్ ఆఫీసర్‌పై గ్రేటర్ అధికారులు చర్యలు తీసుకున్నారు.
హైదరాబాద్: గాజులరామారంలో ఫీల్డ్ ఆఫీసర్ కిషన్ లీలలు వెలుగులోకి వచ్చాయి. ఓ మహిళా పారిశుద్ద్య కార్మికురాలిని లైంగికంగా వేధించిన ఘటన తీవ్ర కలకలం రేపింది. బాధిత మహిళకు సంబంధించిన వీడియోలు కూడా వెలుగులోకి వచ్చాయి. దీంతో బాధితురాలు మీడియా ముందుకు వచ్చి జరిగిన విషయాన్ని వెల్లడించింది. మహిళను వేధించిన ఫీల్డ్ ఆఫీసర్‌పై గ్రేటర్ అధికారులు చర్యలు తీసుకున్నారు. కిషన్‌ను సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించారు.
గాజులరామారం ఘటనపై మేయర్ గద్వాల విజయలక్ష్మి స్పందించారు. మహిళా కార్మికురాలిని వేధించడాన్ని సీరియస్‌గా తీసుకున్నామని చెప్పారు. ఈ ఘటనపై పూర్తిస్థాయి నివేదిక అందజేయాలని జోనల్ కమిషనర్ అభిలాష అభినవ్‌కు ఆమె ఆదేశాలు జారీ చేశారు. నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకోనున్నారు. ఇప్పటికే కిషన్‌ను విధుల నుంచి తొలగించారు.
కుత్బుల్లాపూర్ పరిధిలో గల గాజులరామారం 25 సర్కిల్ పరిధిలో శానిటేషన్ ఫీల్డ్ అసిస్టెంట్‌గా కిషన్ పనిచేస్తున్నాడు. అక్కడ పనిచేసే ఓ పారిశుద్ద్య కార్మికురాలిపై కన్నేశాడు. తాను చెప్పినట్టు వినాలని, లేదంటే వేధింపులు తప్పవని బెదిరించాడు. ఓ గదిలోకి తీసుకెళ్లి లైంగిక వేధింపులకు పాల్పడేవాడు. ఆ తతంగాన్ని తన ఫోన్‌లో రికార్డ్ చేసేవాడు. అయితూ ఆ వీడియోలు బయటకు రావడంతో కిషన్ ఆగడాలు వెలుగుచూశాయి. ఆ వీడియోలు చూసి ఇతర కార్మికులు కిషన్‌ను ప్రశ్నించారు. అయితే ఎవరికీ చెప్పొద్దంటూ కిషన్ డబ్బు ఆశ చూపాడు.
14 మందికి తలా రూ.10 వేల చొప్పున ముట్టజెప్పాడు. అయినప్పటికీ ఆ వీడియోలు వైరల్‌గా మారాయి. దీంతో అతడిపై చర్యలు తీసుకోవాలని కార్మికులు డిమాండ్ చేశారు.
Read Latest Telangana News and National News
Updated Date - May 23 , 2024 | 03:00 PM