ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Alugu Varshini: మరింత నాణ్యంగా గురుకుల భోజనం

ABN, Publish Date - Dec 07 , 2024 | 02:38 AM

‘భోజనం నాణ్యత కోసం నియమించిన ప్రత్యేక అధికారి ఆమోదం తెలిపిన తరువాతే పిల్లలకు భోజనం వడ్డిస్తున్నాం. ఒకవేళ హాస్టల్‌లో భోజనం బాగోలేకపోతే.. మేడమ్‌ వస్తేనే తింటామని టీచర్లకు చెప్పాలంటూ పిల్లలకు సూచించాను.

  • బాగోలేకుంటే మేడమ్‌ వస్తేనే తింటామని టీచర్లకు చెప్పాలని పిల్లలకు సూచించా

  • భోజన మెనూలో త్వరలో మరిన్ని మార్పులు

  • ఇక ప్రవేశ పరీక్ష లేకుండానే ఇంటర్‌ అడ్మిషన్లు

  • ‘ఆంధ్రజ్యోతి’తో ఎస్సీ గురుకులాల కార్యదర్శి వర్షిణి

హైదరాబాద్‌, డిసెంబరు 6 (ఆంధ్రజ్యోతి): ‘భోజనం నాణ్యత కోసం నియమించిన ప్రత్యేక అధికారి ఆమోదం తెలిపిన తరువాతే పిల్లలకు భోజనం వడ్డిస్తున్నాం. ఒకవేళ హాస్టల్‌లో భోజనం బాగోలేకపోతే.. మేడమ్‌ వస్తేనే తింటామని టీచర్లకు చెప్పాలంటూ పిల్లలకు సూచించాను. ఎస్సీ గురుకులాల్లో పిల్లల విషయంలో తల్లిదండ్రులు ఆందోళనపడాల్సిన అవసరం లేదు’ అని ఎస్సీ గురుకులాల కార్యదర్శి అలుగు వర్షిణి అన్నారు. శుక్రవారం ఆమె ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడారు. ‘ఎక్కడైనా పిల్లలు మృతి చెందారన్నా.. ఏమైనా ఇబ్బంది అయిందన్న వార్త వింటే.. ఆ రోజు నిద్ర కూడా పట్టడంలేదు. మేం ఎంతో పవిత్రమైన వృత్తి, బాధ్యతల్లో ఉన్నాం. అలాంటిది పిల్లలకు చెడు జరగాలని ఎవరైనా కోరుకుంటారా?’ అని అన్నారు. ప్రభుత్వం డైట్‌ చార్జీలను పెంచడంతో ఇప్పటికే భోజన మెనూ మారిందని, త్వరలో మెనూలో మరిన్ని మార్పులు చేయబోతున్నామని వెల్లడించారు.


గురుకులాల్లో విద్యార్ధుల మానసికోల్లాసం కోసం.. ‘ప్రాజెక్టు సంపూర్ణ’ పేరుతో క్లాసులు చెబుతున్నామన్నారు. ఇక నుంచి ఎస్సీ గురుకుల పరిధిలోని ఇంటర్‌ కాలేజీల అడ్మిషన్లను నేరుగా భర్తీ చేయనున్నామని, ఎలాంటి ప్రవేశ పరీక్షలు ఉండబోవని చెప్పారు. అయితే, ఈ నిబంధన సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌లకు (సీవోఈ) వర్తించదని.. పదో తరగతిలో మంచి మార్కులు వచ్చి నవారికే సీవోఈల్లో అవకాశం ఉంటుందన్నారు. డిగ్రీ కాలేజీల్లో అడ్మిషన్లకు మాత్రం ప్రవేశ పరీక్ష ఉంటుందన్నారు. వచ్చే విద్యా సంవత్సరానికి ఎస్సీ గురుకులంలో 5వ తరగతి అడ్మిషన్ల ప్రక్రియను సులభతరం చేస్తున్నామన్నారు. కాగా, 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి మే 15 నాటికి అడ్మిషన్ల ప్రక్రియను పూర్తి చేయనున్నట్లు తెలిపారు. ఈ నెల 18న ఐదో తరగతి ప్రవేశాలకు నోటిఫికేషన్‌ జారీ చేసి, ఫిబ్రవరి 23న పరీక్ష నిర్వహించనున్నట్టు చెప్పారు. గురుకులాలను కొంతమంది స్వార్థ రాజకీయాలకు వాడుకోవడం తగదన్నారు. ప్రజాప్రతినిధుల పేరుతో కొంతమంది గురుకులాల్లోకి చొరబడేందుకు యత్నిస్తున్నారని, అలాంటివారిపై కేసులు పెడతామని హెచ్చరించారు.

Updated Date - Dec 07 , 2024 | 02:38 AM