ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

(CCMB) : సంతానలేమికి కారణం తెలిసింది!

ABN, Publish Date - May 17 , 2024 | 04:52 AM

పురుషుల్లో వీర్యకణాల లోపం సమస్యకు టీఈఎక్స్‌13బీ జన్యువు లేకపోవటం ప్రధాన కారణమని సెంటర్‌ ఫర్‌ సెల్యులర్‌ అండ్‌ మాలిక్యులర్‌ బయాలజీ (సీసీఎంబీ) శాస్త్రవేత్తలు కనుగొన్నారు.

టీఈఎక్స్‌13బీ జన్యువు లేమితో వీర్యకణాల్లో లోపం..పురుషులకు తల్లి నుంచి సంక్రమించే జన్యువు

  • అందకపోతే సంతానలేమి సమస్యలు

  • సీసీఎంబీ శాస్త్రవేత్తల పరిశోధనలో వెల్లడి

హైదరాబాద్‌, మే 16: పురుషుల్లో వీర్యకణాల లోపం సమస్యకు టీఈఎక్స్‌13బీ జన్యువు లేకపోవటం ప్రధాన కారణమని సెంటర్‌ ఫర్‌ సెల్యులర్‌ అండ్‌ మాలిక్యులర్‌ బయాలజీ (సీసీఎంబీ) శాస్త్రవేత్తలు కనుగొన్నారు. సీసీఎంబీ సీనియర్‌ శాస్త్రవేత్తలు డాక్టర్‌ కె.తంగరాజ్‌, డాక్టర్‌ చంద్రశేఖర్‌, డాక్టర్‌ స్వస్తిరాయ్‌ చౌదరి బృందం పరిశోధనలో ఇది వెల్లడైంది. ప్రపంచంలో ప్రతి ఏడు జంటల్లో ఒక జంట సంతానలేమి సమస్యతో బాధపడుతోంది.

వీరిలో సగం మందిలో మగవారి వీర్యకణాల లోపం కారణంగా నిలుస్తోంది. వీర్యకణాలు తగినన్ని లేకపోవడం, కణాలు అసాధారణంగా కదలడం, కొందరిలో వీర్యమే లేకపోవడం సమస్యగా మారింది. జన్యులోపాలవల్లే ఈ సమస్య తలెత్తుతోందని తెలిసినప్పటికీ.. ఏ జన్యువులు కారణంగా నిలుస్తున్నాయో ఇప్పటి వరకూ వెల్లడికాలేదు.

దీనిపై సీసీఎంబీ శాస్త్రవేత్తలు మరో మూడు పరిశోధన సంస్థలతో కలిసి అధ్యయనం చేపట్టారు. వీర్యకణాల లోపం ఉన్న వారి వీర్యం నమూనాలను, ఎలాంటి లోపంలేని వారి వీర్యం నమూనాలను అధునాతన సీక్వెన్సింగ్‌ ప్రక్రియ ద్వారా పరిశీలించారు.

ఈ క్రమంలో రెండు టీఈఎక్స్‌13బీ జన్యు మ్యుటేషన్లను గమనించామని.. మొదటి మ్యుటేషన్‌ సంతానంలేని వారి వీర్యంలో కొంతమేర కనిపించగా, రెండో మ్యుటేషన్‌ సంతానం ఉన్న వారి వీర్యంలో స్పష్టంగా కనిపించిందని పరిశోధనలో కీలక పాత్ర పోషించిన సీసీఎంబీ శాస్త్రవేత్త, ప్రస్తుతం అమెరికాలోని మిషిగన్‌ విశ్వవిద్యాలయంలో పోస్ట్‌ డాక్టరేట్‌ చేస్తున్న డాక్టర్‌ ఉమేష్‌ కుమార్‌ తెలిపారు.


ఎలుకల్లో పరిశోధనలు జరిపినప్పుడు టీఈఎక్స్‌13బీ కారణంగా వీర్యకణాలు శ్వాసించే సామర్థ్యం కోల్పోతున్నాయని అంతకుముందే శాస్త్రవేత్తలు గుర్తించారు. మొత్తమ్మీద ఈ జన్యువు లేమి వల్ల వీర్యకణాల అభివృద్ధి జరగడంలేదని శాస్త్రవేత్తలు నిర్ధారణకు వచ్చారు. దీనిపై డాక్టర్‌ తంగ రాజ్‌ మాట్లాడుతూ.. ‘ఈ జన్యువు ఎక్స్‌ క్రోమోజోమ్‌లో ఉంటుంది.

ఇది తండ్రి నుంచి కాకుండా తల్లి నుంచి మగ పిల్లలకు సంక్రమిస్తుంది. తల్లి నుంచి టీఈఎక్స్‌13బీ జన్యువు అందకపోతే మగవారు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటారు’ అని తమ పరిశోధనలో తేలిందని తెలిపారు. హైదరాబాద్‌కు చెందిన మమత ఫెర్టిలిటీ హాస్పిటల్‌, కోల్‌కతాకు చెందిన ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ రిప్రొడక్టివ్‌ మెడిసిన్‌, ముంబైలోని జెనిటిక్‌ రిసెర్చ్‌ సెంటర్‌తో కలిసి సీసీఎంబీ ఈ పరిశోధన జరిపింది. దీని తాలూకు వివరాలు హ్యూమన్‌ రిప్రొడక్షన్‌ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.

Updated Date - May 17 , 2024 | 04:52 AM

Advertising
Advertising