ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Secunderabad: లష్కర్‌లో బోనాల సందడి.. కళకళలాడిన పురవీధులు

ABN, Publish Date - Jul 20 , 2024 | 11:02 AM

లష్కర్‌లో బోనాల ఉత్సవాల సందడి మొదలయింది. మహిళలు భారీగా బోనాలు, ఘటాలతో తరలిరావడంతో రెండురోజుల ముందే ఉత్సవం వచ్చినట్టయింది. ఆదివారం జరగనున్న ఉజ్జయిని మహాకాళి బోనాల(Ujjain Mahakali Bonalu) ఉత్సవాల నేపథ్యంలో రద్దీ ఎక్కువగా ఉంటుందని భావించిన భక్తులు శుక్రవారం నుంచే అమ్మవారికి బోనాలను సమర్పించేందుకు క్యూ కట్టారు.

- ముందే వచ్చిన జాతర

- సికింద్రాబాద్‌లో 21, 22 తేదీల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు

- బోనాలకు 175 బస్సులు

- అక్కన్నమాదన్న మహాకాళి అమ్మవారికి స్పీకర్‌ పూజలు

- లాల్‌దర్వాజలో ఆలయ శిఖర పూజ చేసిన సీపీ

సికింద్రాబాద్‌: లష్కర్‌లో బోనాల ఉత్సవాల సందడి మొదలయింది. మహిళలు భారీగా బోనాలు, ఘటాలతో తరలిరావడంతో రెండురోజుల ముందే ఉత్సవం వచ్చినట్టయింది. ఆదివారం జరగనున్న ఉజ్జయిని మహాకాళి బోనాల(Ujjain Mahakali Bonalu) ఉత్సవాల నేపథ్యంలో రద్దీ ఎక్కువగా ఉంటుందని భావించిన భక్తులు శుక్రవారం నుంచే అమ్మవారికి బోనాలను సమర్పించేందుకు క్యూ కట్టారు. పోతరాజుల విన్యాసాలు, ఘటాల ఊరేగింపులు, తలపై బోనాలతో భారీగా తరలివచ్చిన మహిళలతో అమ్మవారి ఆలయం జాతరను తలపించింది. కొందరు భక్తులు ఘటాలను సమర్పించి మొక్కులు తీర్చుకోగా.. మరికొందరు అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించారు. దర్శనానికి భక్తులు పెద్దసంఖ్యలో రావడంతో ఆలయ పరిసరాలు రద్దీగా మారాయి. లష్కర్‌ పురవీధులన్నీ కళకళలాడాయి. భక్తులను క్యూలో పంపించడానికి ఉత్తర మండల డీసీపీ రేష్మా పెరుమాళ్‌ ఆధ్వర్యంలో పోలీసు యంత్రాంగం శ్రమించింది.

ఇదికూడా చదవండి: ‘మహా’ టీడీఆర్‌ బ్యాంక్‌.. అందుబాటులోకి తీసుకొచ్చిన హెచ్‌ఎండీఏ


ఇదికూడా చదవండి: కాల్పుల కలకలం.. పోలీసులపై గొడ్డలి, రాళ్లతో యువకుల దాడి

ఇదికూడా చదవండి: మీపై ఫెమా కేసు.. అరెస్ట్‌ తప్పదంటూ బెదిరింపులు

Read Latest Telangana News and National News

Read Latest AP News and Telugu News

Updated Date - Jul 20 , 2024 | 02:58 PM

Advertising
Advertising
<