ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Secunderabad: ఔషధ వినియోగం తగ్గించండి.. ఆరోగ్యంగా ఉంటారు

ABN, Publish Date - Jul 23 , 2024 | 09:28 AM

పాడిపంటల్లో ఔషధాల వినియోగం తగ్గించండి.. అప్పుడే ఆరోగ్యం చక్కబడుతుంది. ఆయుష్షు పెరుగుతుంది.. అంటూ భవిష్యవాణి వినిపించిన స్వర్ణలత ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఉజ్జయిని మహాకాళి(Ujjaini Mahakali) బోనాల జాతరలో సోమవారం రంగం నిర్వహించారు.

- ‘రంగం’లో స్వర్ణలత భవిష్యవాణి

- వర్షాలకు కొదువలేదు..

- కష్టపడకపోతే ప్రజలు సోమరులవుతారు..

సికింద్రాబాద్‌: పాడిపంటల్లో ఔషధాల వినియోగం తగ్గించండి.. అప్పుడే ఆరోగ్యం చక్కబడుతుంది. ఆయుష్షు పెరుగుతుంది.. అంటూ భవిష్యవాణి వినిపించిన స్వర్ణలత ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఉజ్జయిని మహాకాళి(Ujjaini Mahakali) బోనాల జాతరలో సోమవారం రంగం నిర్వహించారు. మాతంగి స్వర్ణలత పసుపు పూసుకొని, చేతిలో గవ్వలహారం, తంబూర పట్టుకుని శ్రీమహాకాళి అమ్మవారి గర్భగుడికి ఎదురుగా ఉన్న మాతంగేశ్వరీ ఆలయం ముఖమండపం వద్ద పచ్చికుండపై నిలుచుని అమ్మవారిని ఆవహించుకుని భవిష్యవాణి వినిపించారు. జనం ఎక్కువగా మధుమేహం (డయాబెటీస్)తో బాధపడుతున్నారని, దీనికి నివారణ లేదా అంటూ భక్తులు అడిగిన ప్రశ్నకు ఆమె బదులిచ్చారు. ‘పాడిపంటలు ఇంతకుముందులా లేవు.. ఎక్కువగా ఔషధాలు వాడుతున్నారు. అందువల్లే మీకు రోగాలు వస్తున్నాయి..’ అంటూ భవిష్యవాణి చెప్పారు. రాష్ట్రంలో సరిపడా వర్షాలు కురుస్తాయని, అనుమానాలు పెట్టుకోవలసిన అవసరం లేదన్నారు. కష్టపడకపోతే ప్రజలు సోమరిపోతులవుతారని అన్నారు. ఈ ఏడాది బోనాల జాతర పూజలపై సంతృప్తి వ్యక్తం చేశారు. తనను నమ్ముకునే భక్తులను ఆనందంగా ఉంచుతానన్నారు. బాలికలను, గర్బిణులను కంటికి రెప్పలా కాపాడుకుంటానని భరోసా ఇచ్చారు.

ఇదికూడా చదవండి: TS Assembly: గట్టి కౌంటర్‌కు కాంగ్రెస్ రెడీ.. నేటి నుంచే తెలంగాణ అసెంబ్లీ


సక్సెస్‌ చేశారు.. సంతోషం

- అధికారులకు, ప్రజలకు మంత్రి పొన్నం కృతజ్ఞతలు

హైదరాబాద్‌ సిటీ: బోనాల పండుగను విజయవంతం చేయడంలో అధికార యంత్రాంగం సహకారంపై జిల్లా ఇన్‌చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్‌(In-charge Minister Ponnam Prabhakar) కృతజ్ఞతలు తెలిపారు. దేవాదాయ శాఖ, పోలీస్‌, ఫైర్‌, ట్రాఫిక్‌, జీహెచ్‌ఎంసీ, విద్యుత్‌, తదితర శాఖల అధికారుల సహకారంతో బోనాలు విజయవంతం అయ్యాయని వారందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. నగరంలో ఆషాడమాస బోనాలను సమర్థవంతంగా నిర్వహిస్తున్నామని అన్నారు. ఈనెల 7న గోల్కొండలో ప్రారంభమైన బోనాలు ఆగస్టు 4న ముగుస్తాయన్నారు. గతేడాది కంటే ఈసారి ఆలయాలకు నిధులు ఎక్కువగా అందజేశామన్నారు. రంగంలో భవిష్యవాణి చెప్పినట్లుగా రాబోయే కాలంలో అమ్మవారి ఆశీర్వాదంతో ప్రకృతి సహకరించి రాష్ట్రంలో వర్షాలు సమృద్థిగా కురవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో దేవాదాయ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ శైలజా రామయ్యర్‌, కమిషనర్‌ హనుమంతరావు, కలెక్టర్‌ అనుదీప్‌ దురిశెట్టి, పోలీస్‌, రెవెన్యూ, దేవాదాయ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.


ఇదికూడా చదవండి: కాల్పుల కలకలం.. పోలీసులపై గొడ్డలి, రాళ్లతో యువకుల దాడి

ఇదికూడా చదవండి: మీపై ఫెమా కేసు.. అరెస్ట్‌ తప్పదంటూ బెదిరింపులు

Read Latest Telangana News and National News

Read Latest AP News and Telugu News

Updated Date - Jul 23 , 2024 | 09:28 AM

Advertising
Advertising
<