ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Secunderabad: నాడు బీఆర్‌ఎస్‌, నేడు కాంగ్రెస్‌ దొందూదొందే..

ABN, Publish Date - Dec 12 , 2024 | 09:56 AM

నాడు బీఆర్‌ఎస్‌, నేడు కాంగ్రెస్‌ పార్టీ కంటోన్మెంట్‌ ప్రజలను మోసగిస్తూనే ఉన్నాయని కంటోన్మెంట్‌ నామినేటెడ్‌ సభ్యుడు జే.రామకృష్ణ(J. Ramakrishna) అన్నారు. బుధవారం కంటోన్మెంట్‌ ఇందిరమ్మనగర్‌(Cantonment Indirammanagar)లో పర్యటించిన ఆయన సీసీ రోడ్డు నిర్మాణానికి భూమిపూజ చేసి పనులను ప్రారంభించారు.

- కంటోన్మెంట్‌ సభ్యుడు రామకృష్ణ

సికింద్రాబాద్‌: నాడు బీఆర్‌ఎస్‌, నేడు కాంగ్రెస్‌ పార్టీ కంటోన్మెంట్‌ ప్రజలను మోసగిస్తూనే ఉన్నాయని కంటోన్మెంట్‌ నామినేటెడ్‌ సభ్యుడు జే.రామకృష్ణ(J. Ramakrishna) అన్నారు. బుధవారం కంటోన్మెంట్‌ ఇందిరమ్మనగర్‌(Cantonment Indirammanagar)లో పర్యటించిన ఆయన సీసీ రోడ్డు నిర్మాణానికి భూమిపూజ చేసి పనులను ప్రారంభించారు. అంతకు ముందు స్థానికులతో సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు తాగునీటి విషయంలో సరిపడా తాగునీరు ఇవ్వాలని రామకృష్ణను కోరారు.

ఈ వార్తను కూడా చదవండి: BJP: సుష్మాస్వరాజ్‌ లేకుంటే తెలంగాణ వచ్చేదే కాదు..


అందుకు స్పందించిన రామకృష్ణ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం కంటోన్మెంట్‌ అవసరం ఉన్నన్ని ప్రాంతాలకు నీరు సరఫరా చేయకపోవటం వలన ప్రజలకు పూర్తిస్ధాయిలో నీళ్లు ఇవ్వలేకపోతున్నామని అన్నారు. ఒక పక్క కంటోన్మెంట్‌లో సరిపడా నీళ్లు రావటంలేదని ప్రజలు నిత్యం గోడును వెళ్లబోసుకుంటుంటే మరోపక్క కాంగ్రెస్‌ ఇంచార్జి మంత్రి, నాయకులు సరిపడా నీళ్లు అందిస్తున్నామని ఏ సమస్య లేదని మాట్లాడటం విడ్డూరంగా ఉందని ఆరోపించారు. బీజేపీ(BJP) నాయకుల పోరాటానికి తలొగ్గి నాటి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఉచిత నీటిని అందించిందని గుర్తు చేశారు.


కాంగ్రెస్‌ నాయకులు ఇకనైనా ఫ్యాషన్‌ షోలు చేయటం మానుకోని కంటోన్మెంట్‌ ప్రజలకు సరిపడా నీళ్లు అందిచ్చేలా రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని సూచించారు. లేని పక్షంలో కంటోన్మెంట్‌ ప్రజల తరపున పోరాటం చేసి ప్రజలకు నీళ్లు అందించే బాధ్యత బీజేపీ తీసుకుంటుందని స్పష్టంచేశారు. కార్యక్రమంలో వార్డు2 బీజేపీ అధ్యక్షుడు మాదరపు అశోక్‌, నాయకులు జయ యాదవ్‌, మమతా, రేఖ, ప్రశాంత్‌, శ్యామ్‌, తదితరులు పాల్గొన్నారు.


ఈవార్తను కూడా చదవండి: Special Trains: శబరిమలకు 26 ప్రత్యేక రైళ్లు: ద.మ. రైల్వే

ఈవార్తను కూడా చదవండి: హాస్టల్‌ ఫుడ్‌ పాయిజన్‌ ఘటనల్లో.. ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌పై అనుమానాలు

ఈవార్తను కూడా చదవండి: విద్యార్థుల సమస్యలు పట్టవా రేవంత్‌: కవిత

ఈవార్తను కూడా చదవండి: ఉత్తమ పార్లమెంటేరియన్‌ తరహాలో ఏటా ఉత్తమ లెజిస్లేచర్‌ అవార్డు

Read Latest Telangana News and National News

Updated Date - Dec 12 , 2024 | 09:56 AM