ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Aadi Srinivas: సార్‌... మీరెవరూ..!?

ABN, Publish Date - Dec 17 , 2024 | 04:04 AM

సార్‌... మీరెవరూ..? అంటూ వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివా్‌సకు అసెంబ్లీ ప్రాంగణంలో భద్రతా సిబ్బంది నుంచి ప్రశ్న ఎదురైంది.

  • ఎమ్మెల్యే ఆది శ్రీనివా్‌సకు అసెంబ్లీ భద్రతా సిబ్బంది ప్రశ్న

హైదరాబాద్‌, డిసెంబరు 16 (ఆంధ్రజ్యోతి): సార్‌... మీరెవరూ..? అంటూ వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివా్‌సకు అసెంబ్లీ ప్రాంగణంలో భద్రతా సిబ్బంది నుంచి ప్రశ్న ఎదురైంది. సోమవారం మధ్యాహ్నం అసెంబ్లీ సమావేశం వాయిదా అనంతరం ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌ తన సహచరులతో కలిసి అసెంబ్లీ ఆవరణలోని మీడియా పాయింట్‌కు వెళ్తున్నారు. మీడియా పాయింట్‌ వద్ద భద్రతా విధుల్లో ఉన్న ఓ ఎస్సై, మహిళా కానిస్టేబుల్‌తోపాటు మరికొంత మంది సిబ్బంది ఎమ్మెల్యే ఆది శ్రీనివా్‌సను ఆపి సార్‌... మీరెవరూ? అని ప్రశ్నించారు. భద్రతా సిబ్బంది ప్రశ్నతో ఆవాక్కైన శ్రీనివాస్‌... నేనెవరో తెలియదా అని వారిని అడిగారు. అంతే కాదు మీ విషయం ఏంటో మీ సార్‌తో మాట్లాడతానని వారికి చెప్పి మీడియా పాయింట్‌ వద్దకు వెళ్లారు.

Updated Date - Dec 17 , 2024 | 04:04 AM