ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

విద్రోహ శక్తుల్లారా.. ఖబడ్దార్‌!

ABN, Publish Date - Nov 13 , 2024 | 04:58 AM

‘‘విద్రోహ శక్తుల్లారా.. ఉద్యోగుల జోలికొస్తే ఖబడ్దార్‌. రాజకీయ సంచలనాల కోసం మాతో పెట్టుకోవద్దు. అధికారులు, ఉద్యోగులు లేకుండా మీకు పూట గడవదు.

  • ‘లగచర్ల’ దోషులను అరెస్టు చేసేదాకా నిరసనలు

  • వికారాబాద్‌ కలెక్టరేట్‌ వద్ద ఉద్యోగుల జేఏసీ నేతల ధర్నా

వికారాబాద్‌, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ‘‘విద్రోహ శక్తుల్లారా.. ఉద్యోగుల జోలికొస్తే ఖబడ్దార్‌. రాజకీయ సంచలనాల కోసం మాతో పెట్టుకోవద్దు. అధికారులు, ఉద్యోగులు లేకుండా మీకు పూట గడవదు. మేం ఒక్కసారి కళ్లు తెరిస్తే మీ జీవితం ఎక్కడుంటుందో గుర్తుంచుకోండి. లగచర్లలో అధికారులపై దాడిలో కుట్ర కోణాన్ని ఛేదించి దోషులందరినీ అరెస్టు చేసే వరకు నిరసనలు కొనసాగుతాయి’’ అని తెలంగాణ ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల జేఏసీ సెక్రటరీ జనరల్‌ ఏలూరి శ్రీనివాసరావు స్పష్టం చేశారు. వికారాబాద్‌ జిల్లా దుద్యాల మండ లం లగచర్ల వద్ద అధికారులపై జరిగిన దాడిని నిరసిస్తూ మంగళవారం ట్రెసా రాష్ట్ర అధ్యక్షుడు వంగ రవీందర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి కె.గౌతమ్‌కుమార్‌ల ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ వద్ద ఉద్యోగులు నల్ల బ్యాడ్జీ లతో బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. దీనికి హాజరైన శ్రీనివాసరావు మాట్లాడుతూ.. వ్యవస్థను మార్చే శక్తి అధికారులకు, ఉద్యోగులకు ఉందని చెప్పారు. అలాంటి ఉద్యోగులను రాజకీయాల్లోకి లాగొద్దని, అలా చేస్తే తేనెతుట్టెను కదిపినట్లేనని హెచ్చరించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్రంలో పది లక్షల మంది ఉద్యోగులం ఏకతాటిపై ఉంటూ, సహనం పాటిస్తున్నామని చెప్పారు. అధికారులపై దాడి జరిగితే రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు స్పందించకపోవడంఆవేదన కలిగిస్తోందన్నారు. ఉద్యోగులకు రక్షణ కల్పించకపోతే నష్టపోయేది మీరేనని రాజకీయ నేతలను ఉద్దేశించి పేర్కొన్నారు.


లగచర్లలో అధికారులపై దాడి రాజకీయ కుట్రతోనే జరి గిందన్నారు. అధికారులు, ఉద్యోగులపై దాడులకు పా ల్పడడం ద్వారా ఉద్యోగులను ప్రభుత్వానికి దూరం చేయాలనే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. దోషులను అరెస్టు చేసే వరకు నిరసన కార్యక్రమాలు కొనసాగుతాయన్నారు. లేకపోతే అన్ని ఉద్యోగ సంఘాల నేతలతో చర్చించి, సమగ్ర కార్యాచరణ ప్రకటిస్తామని ఆయన తెలిపారు. ట్రెసా నేతలు రవీందర్‌రెడ్డి, గౌతమ్‌కుమార్‌ మాట్లాడుతూ.. అధికారులపై దాడులకు పాల్పడిన వారితో పాటు వారి వెనకున్న వారినీ శిక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. బుధవా రం వరకు దోషులందరినీ అరెస్టు చేయాలని, అప్ప టిదాకా ఉద్యోగులెవరూ విధులకు వెళ్లొద్దని చెప్పా రు. నిందితులను అరెస్టు చేయకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగులందరూ రోడ్లెక్కుతారని స్పష్టం చేశారు. అనంతరం సంఘాల నేతలు జిల్లా అదనపు కలెక్టర్‌ లింగ్యానాయక్‌కు వినతిపత్రం అందజేశారు.

Updated Date - Nov 13 , 2024 | 04:58 AM