ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Weather: ఇక గజ గజ వణకడమే.. భారీగా పెరగనున్న చలి తీవ్రత..

ABN, Publish Date - Dec 13 , 2024 | 03:37 AM

రాష్ట్రంలో చలి తీవ్రత పెరుగుతుంది. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాలు చలితో గజగజలాడుతున్నాయి. ఓ వైపు పొగ మంచు కమ్మేస్తుండగా.. ఉష్ణోగ్రతలు కూడా పడిపోతుండడంతో పగలు, రాత్రీ అనే తేడా లేకుండా ఏజెన్సీ ప్రాంత గ్రామాల ప్రజలు చలికి వణికిపోతున్నారు.

Winter Effect

  • ఆదిలాబాద్‌ జిల్లా బేలలో 7 డిగ్రీలు నమోదు

  • వచ్చే మూడు రోజుల్లో రాష్ట్రంలో మరింత చలి

  • 2-4 డిగ్రీల మధ్యకు పడిపోయే చాన్స్‌

ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, మెదక్‌ అర్బన్‌, హైదరాబాద్‌, డిసెంబరు12 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో చలి తీవ్రత పెరుగుతుంది. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాలు చలితో గజగజలాడుతున్నాయి. ఓ వైపు పొగ మంచు కమ్మేస్తుండగా.. ఉష్ణోగ్రతలు కూడా పడిపోతుండడంతో పగలు, రాత్రీ అనే తేడా లేకుండా ఏజెన్సీ ప్రాంత గ్రామాల ప్రజలు చలికి వణికిపోతున్నారు. ఆదిలాబాద్‌ జిల్లా బేలలో రాష్ట్రంలో అత్యల్పంగా గురువారం 7.0డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే భీంపూర్‌ మండలం అర్లి(టి)లో 7.2, మావలలో 7.4, నేరడిగొండలో 7.5, బోథ్‌లో 7.6, ఆదిలాబాద్‌ రూరల్‌లో 8.2, బజార్‌హత్నూర్‌లో 8.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కుమరంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలోని సిర్పూర్‌(యు) మండలంలో గురువారం 7.3 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైంది.


రాజన్నసిరిసిల్ల జిల్లా గంభీరావుపేట, రుద్రంగి మండలాల్లో 10.4, మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలో 10.8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అలాగే, మెదక్‌ జిల్లా శివ్వంపేటలో 9.4, సంగారెడ్డి జిల్లా కోహిర్‌లో 9.5, సిద్దిపేట జిల్లా పోతారెడ్డిపేటలో 10.5 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. కాగా, రాబోయే మూడు రోజుల్లో రాష్ట్రంలో చలి తీవ్రత మరింత పెరగనుందని హైదరాబాద్‌ ప్రాంతీయ వాతావరణ కేంద్రం ప్రకటించింది. కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు రెండు నుంచి మూడు డిగ్రీల వరకు పడిపోతాయని హెచ్చరించింది. ఉత్తర తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో చలిగాలి ప్రభావం ఎక్కువగా ఉంటుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

Updated Date - Dec 13 , 2024 | 09:49 AM