ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Vikarabad: అమ్మా.. నన్ను చంపొద్దే.. ప్లీజ్‌..!!

ABN, Publish Date - Dec 09 , 2024 | 04:19 AM

వికారాబాద్‌ జిల్లాలో దారుణం జరిగింది. ఓ మహిళ ఆరేళ్ల వయస్సు ఉన్న తన కన్నకొడుకును బావిలోకి తోసేసి.. అనంతరం ఆమె కూడా బావిలోకి దూకి ఆత్మహత్య చేసుకుంది.

  • ఆరేళ్ల కొడుకును బావిలోకి తోసి తాను దూకిన తల్లి

  • తొలుత కూతురిని నెట్టేందుకు యత్నం

  • చంపొద్దని వేడుకోవడంతో చిన్నారిని వదిలేసిన వైనం

  • అక్కడికక్కడే మృత్యువాత పడిన తల్లీకొడుకులు

  • వికారాబాద్‌ జిల్లా గేటువనంపల్లిలో ఘటన

నవాబుపేట/ వికారాబాద్‌, డిసెంబరు 8 (ఆంధ్రజ్యోతి): వికారాబాద్‌ జిల్లాలో దారుణం జరిగింది. ఓ మహిళ ఆరేళ్ల వయస్సు ఉన్న తన కన్నకొడుకును బావిలోకి తోసేసి.. అనంతరం ఆమె కూడా బావిలోకి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఆ మహిళ తొలుత తన కూతురిని బావిలోకి నెట్టాలని ప్రయత్నించగా.. ‘‘అమ్మా నన్ను చంపొద్దు ప్లీజ్‌’’ అని వేడుకోవడంతో ఆ చిన్నారిని వదిలేయడంతో ఆ బాలికతో ప్రాణాలతో మిగిలింది. వికారాబాద్‌ జిల్లా, నవాబ్‌పేట మండలం, గేటువనంపల్లి గ్రామంలో ఈ ఘటన జరిగింది. పోలీసులు, కుటుంబసభ్యులు, గ్రామ ప్రజల కథనం ప్రకారం.. గేటువనంపల్లికి చెందిన గుల్ల రాములు మోమిన్‌పేట మండలం టేకులపల్లికి చెందిన అరుంధ(32)ను 2008లో రెండో వివాహం చేసుకున్నాడు. రాములు మొదటి భార్య అప్పటికే మరణించింది. రాములు, అరుంధ దంపతులకు కూతురు ప్రజ్వల(11), కొడుకు రిత్విక్‌(6) ఉన్నారు.


వ్యవసాయ పనుల నిమిత్తం రాములు శనివారం పొలానికి వెళ్లగా... గేటువనంపల్లికే చెందిన శేఖర్‌ అనే వ్యక్తితో అరుంధ ఫోన్‌లో మాట్లాడింది. అనంతరం సాయంత్రం నాలుగు గంటలప్పుడు ప్రజ్వల, రిత్విక్‌ను వెంటబెట్టుకుని పొలానికి బయలుదేరింది. దారిలో ఓ బావి వద్ద ఆగి శేఖర్‌తో మరోసారి ఫోన్‌లో మాట్లాడి గుడ్‌ బై చెప్పింది. ఆ తర్వాత ప్రజ్వలను బావిలోకి నెట్టేందుకు యత్నించగా.. చంపవద్దని ఆమె ఏడవడంతో వదిలేసింది. అనంతరం రిత్విక్‌ను బావిలోకి తోసేసి ఆమె కూడా దూకేసింది. ఘటనా స్థలి నుంచి గ్రామానికి వచ్చిన ప్రజ్వల జరిగిన విషయం కుటుంబసభ్యులకు చెప్పగా బావి వద్దకు చేరుకున్నారు. అప్పటికే తల్లీకొడుకులు చనిపోయారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఆదివారం ఉదయం మృతదేహాలను వెలికి తీయించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం వికారాబాద్‌ ఆస్పత్రికి తరలించి.. అరుంధ తల్లి కమలమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Updated Date - Dec 09 , 2024 | 04:19 AM