ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Shadnagar: చెవి కమ్మల కోసం చంపేశారు!

ABN, Publish Date - Sep 29 , 2024 | 04:51 AM

ఓ మహిళను దారుణంగా హత్య చేసిన దుండగులు ఆమె చెవులను కోసేసి బంగారు కమ్మలను అపహరించుకుపోయారు.

  • షాద్‌నగర్‌లో మహిళ దారుణ హత్య

  • మృతదేహాన్ని ప్లాస్టిక్‌ సంచిలో చుట్టి పడేశారు

షాద్‌నగర్‌ రూరల్‌, సెప్టెంబరు 28 (ఆంధ్రజ్యోతి): ఓ మహిళను దారుణంగా హత్య చేసిన దుండగులు ఆమె చెవులను కోసేసి బంగారు కమ్మలను అపహరించుకుపోయారు. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌ పట్టణంలోని ఫరూఖ్‌నగర్‌ శ్రీనివాస కాలనీలో శుక్రవారం రాత్రి ఈ ఘటన జరిగింది. జిల్లేడు-చౌదరిగూడ మండలం ముష్టిపల్లి గ్రామానికి చెందిన వెంకటయ్య, భాగ్యలక్ష్మి(40) భార్యాభర్తలు. ఇద్దరూ కూలి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే, కొంతకాలంగా భాగ్యలక్ష్మి భర్త వెంకటయ్యకు దూరంగా శ్రీనివాసనగర్‌ కాలనీలో ఉంటోంది.


ఈ క్రమంలో శుక్రవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు ఆమెను హత్య చేసి.. మృతదేహాన్ని ప్లాస్టిక్‌ సంచిలో చుట్టి శ్రీనివాస కాలనీలో పడేశారు. చెవి కమ్మల కోసం దుండగులు ఏకంగా ఆమె చెవులను కోసేశారు. రాత్రి 8.30 గంటల సమయంలో హాజీపల్లి రోడ్డులో భాగ్యలక్ష్మి ఓ వ్యక్తితో మాట్లాడినట్లు అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డయింది. అందులో ఆమె ఆ వ్యక్తికి డబ్బులు ఇచ్చినట్లు పోలీసుల విచారణలో తేలింది. పోలీసులు సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా బృందాలను ఏర్పాటు చేసి నిందితుడి కోసం గాలిస్తున్నారు. మహిళను హత్య చేసిన నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం.

Updated Date - Sep 29 , 2024 | 04:51 AM