ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Diwali bonus: నేడు సింగరేణి కార్మికులకు దీపావళి బోనస్‌

ABN, Publish Date - Oct 25 , 2024 | 03:34 AM

దీపావళి సందర్భంగా పీఎల్‌ఆర్‌ఎస్‌ (ప్రొడక్షన్‌ లింక్డ్‌ రివార్డు స్కీం) బోన్‌సను శుక్రవారం సింగరేణి కార్మికులకు చెల్లించనున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు.

  • ఒక్కో కార్మికునికి రూ.93,750 చెల్లింపు

కొత్తగూడెం/హైదరాబాద్‌, అక్టోబరు 24(ఆంధ్రజ్యోతి): దీపావళి సందర్భంగా పీఎల్‌ఆర్‌ఎస్‌ (ప్రొడక్షన్‌ లింక్డ్‌ రివార్డు స్కీం) బోన్‌సను శుక్రవారం సింగరేణి కార్మికులకు చెల్లించనున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. రూ.358 కోట్లను విడుదల చేయాలని సింరేణి సీఎండీ బలరాంను ఆదేశించారు. గురువారం ఆయన సచివాలయంలో సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. గత ఏడాది చెల్లించిన దీపావళి బోనస్‌ కన్నా ప్రస్తుతం ప్రకటించిన మొత్తం రూ.50కోట్లు అధికం కావడం విశేషం. బోనస్‌ కింద ఒక్కో కార్మికుడు రూ.93,750 అందుకోనున్నారు.


సింగరేణిలో పనిచేస్తున్న 40వేల మంది కార్మికులు లబ్ధి పొందనున్నారు. కాగా, ఇటీవల సింగరేణి ఉద్యోగులందరికీ 33ు లాభాల వాటా కింద రూ.796కోట్లను కంపెనీ చెల్లించిన విషయం తెలిసిందే. ఒక్కో కార్మికుడికి సగటున రూ.1.90లక్షలు అందాయి. పండుగ అడ్వాన్స్‌ కింద ఒక్కో కార్మికుడికి రూ.25వేల చొప్పున మరో రూ.90 కోట్లను చెల్లించారు. లాభాల వాటా, పండుగ అడ్వాన్స్‌, దీపావళి బోనస్‌ కలిపి నెల వ్యవధిలో కార్మికులకు సంస్థ రూ.1250కోట్లను చెల్లించింది. సగటున ఒక్కో ఉద్యోగి రూ.3లక్షల వరకు ప్రయోజనం పొందినట్లు సీఎండీ బలరాం తెలిపారు.

Updated Date - Oct 25 , 2024 | 03:34 AM