ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Mahabubabad: ఇన్‌స్టా రీల్‌తో చిన్నారులకు పెద్ద సాయం

ABN, Publish Date - Sep 13 , 2024 | 03:58 AM

సోషల్‌ మీడియాను సక్రమంగా వాడుకుంటే అద్భుతాలు జరుగుతాయి, ఎన్నో సమస్యలు ఇట్టే పరిష్కారమవుతాయి అనేందుకు ఉదాహరణగా నిలిచే ఘటన మహబూబాబాద్‌ జిల్లాలో జరిగింది.

  • తల్లిని కోల్పోయిన పిల్లలకు రూ.21లక్షలు ఇచ్చిన దాతలు

నర్సింహులపేట(మహబూబాబాద్‌ జిల్లా), సెప్టెంబరు 12 : సోషల్‌ మీడియాను సక్రమంగా వాడుకుంటే అద్భుతాలు జరుగుతాయి, ఎన్నో సమస్యలు ఇట్టే పరిష్కారమవుతాయి అనేందుకు ఉదాహరణగా నిలిచే ఘటన మహబూబాబాద్‌ జిల్లాలో జరిగింది. తల్లిని కోల్పోయిన అభంశుభం తెలియని ఇద్దరు చిన్నారులకు మానవత్వం కలిగిన ఎన్నో హృదయాలు అండగా నిలిచాయి. ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ రీల్‌ను చూసి స్పందించిన దాతలంతా కలిసి ఆ చిన్నారులకు ఏకంగా రూ.21 లక్షలు ఆర్థిక సాయం చేసి ఔరా అనిపించారు. వివరాలిలా ఉన్నాయి.. మహబూబాబాద్‌ జిల్లా నర్సింహులపేట మండలం బొజ్జన్నపేటకు చెందిన బేతమల్ల నరేష్‌, ఉమ దంపతులకు ఐదేళ్ల క్రితం వివాహమైంది. నరేష్‌ తాపి మేస్త్రీగా పని చేస్తుంటాడు.


ఈ దంపతులకు ఓ కుమార్తె(3), ఓ కుమారుడు(నెలన్నర) ఉన్నారు. అయితే, కొడుకును ప్రసవించిన ఎనిమిది రోజులకు, జూలై 28న ఉమ బ్రెయిన్‌ స్ట్రోక్‌ గురై మరణించింది. నిరుపేద అయిన తండ్రి, లోకం తెలియని ఆ పిల్లల పరిస్థితిని తెలుసుకున్న మహబూబాబాద్‌ జిల్లా కురివికి చెందిన సోషల్‌ మీడియా ఇన్ఫులెయెన్సర్‌ గంగరబోయిన రఘు చలించిపోయారు. నరేష్‌ ఇంటికి వెళ్లి వారి పరిస్థితిని వివరించేలా ఓ వీడియో చేసి ఆ పిల్లలకు సాయం చేయాలని కోరుతూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు. రఘు పిలుపునకు స్పందించి ముందుకొచ్చిన దాతలు ఆర్థిక సాయం పంపారు. దాతల పంపిన మొత్తం రూ.21 లక్షలు అవ్వగా.. ఆ సొమ్మును చిన్నారుల పేరిట మహబూబాబాద్‌ ఎస్‌బీఐలో ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేశారు. ఇందుకు సంబంధించిన పత్రాలను నరే్‌షకు గురువారం అందజేశారు. ఆ చిన్నారులకు ఇంత సాయం అందడానికి కారణమైన గంగరబోయిన రఘును పలువురు అభినందించారు.

Updated Date - Sep 13 , 2024 | 03:58 AM

Advertising
Advertising