ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Special trains: మేడారం భక్తులకు ప్రత్యేక రైళ్లు.. వివిధ ప్రాంతాలనుంచి వరంగల్‌కు 30 రైళ్ల ఏర్పాటు

ABN, Publish Date - Feb 18 , 2024 | 01:19 PM

ములుగు జిల్లా మేడారంలో ఈ నెల 21 నుంచి నాలుగు రోజుల పాటు జరగనున్న సమ్మక్క, సారలమ్మ మహాజాతరకు వెళ్లే భక్తుల కోసం దక్షిణ మధ్య రైల్వే(South Central Railway) ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది.

ఖమ్మం: ములుగు జిల్లా మేడారంలో ఈ నెల 21 నుంచి నాలుగు రోజుల పాటు జరగనున్న సమ్మక్క, సారలమ్మ మహాజాతరకు వెళ్లే భక్తుల కోసం దక్షిణ మధ్య రైల్వే(South Central Railway) ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వరంగల్‌ వరకు ఈ రైళ్లను నడపనున్నారు. జన్‌ సాధారణ్‌ పేరుతో 30 ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్టు దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ అరుణ్‌ కుమార్‌ జైన్‌ తెలిపారు. పూర్తిగా అన్‌రిజర్వ్‌డ్‌ కోచ్‌లతో ఈ రైళ్లు రాకపోకలు సాగించనున్నాయి. గతంలో రెండు ప్రాంతాల నుండి మాత్రమే ప్రత్యేక రైళ్లు నడిచేవి. ఈసారి సికింద్రాబాద్‌, ఆదిలాబాద్‌, ఖమ్మం, నిజామాబాద్‌, సిర్పూర్‌ కాగజ్‌నగర్‌ తదితర ప్రాంతాల నుంచి నడుపుతున్నారు. అన్ని ప్రధానస్టేషన్లలో రైళ్లను ఆపేందుకు చర్యలు తీసుకుంటున్నారు.

ప్రత్యేక రైళ్లలో 10 రైళ్లు సికింద్రాబాద్‌-వరంగల్‌- సికింద్రాబాద్‌(Secunderabad-Warangal- Secunderabad) మధ్య, 8 రైళ్లు సిర్పూర్‌ కాగజ్‌నగర్‌ -వరంగల్‌- సిర్పూర్‌ కాగజ్‌నగర్‌ మధ్య, 8 రైళ్లు నిజామాబాద్‌ -వరంగల్‌- నిజామాబాద్‌, రెండు రైళ్లు ఆదిలాబాద్‌-వరంగల్‌- ఆదిలాబాద్‌, మరో రెండు రైళ్లు ఖమ్మం - వరంగల్‌- ఖమ్మం మధ్య నడుస్తాయని జీఎం తెలిపారు.

ఖమ్మం నుంచి ప్రత్యేక రైలు

ఖమ్మం రైల్వే స్టేషన్‌ నుంచి మేడారం జాతర కోసం ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేశారు. రైలు నెంబర్‌ 07021 23న ఉదయం 10 గంటలకు ఖమ్మంలో బయలుదేరి అదే రోజు 12.20 గంటలకు వరంగల్‌ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో రైలు నం. 07022న 13.55 గంటలకు వరంగల్‌లో బయలుదేరి అదే రోజు 16.30 గంటలకు ఖమ్మం చేరుకుంటుంది. ఈ ప్రత్యేక రైళ్లు మల్లెమడుగు, పాపటపల్లి, డోర్నకల్‌, గుండ్రాతిమడుగు, మహబూబాబాద్‌, కేసముద్రం, నెక్కొండ, చింతల్‌పల్లి స్టేషన్లలో రెండు వైపులా ఆగుతాయని, ఈ రైళ్లలో సెకండ్‌ క్లాస్‌ సిటింగ్‌ కోచ్‌లు ఉంటాయని రైల్వే అధికారులు తెలిపారు. భక్తులు ఉపయోగించుకోవాలని కోరారు.

నేటి నుంచి ఆర్టీసీ బస్సులు

ఖమ్మం ఖానాపురంహవేలి: భక్తులసౌకర్యార్థం మేడారం జాతరకు ఖమ్మం డిపో నుంచి ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసిందని డిపో మేనేజర్‌ శ్రీనివాసరావు తెలిపారు. ఖమ్మం కొత్తబస్టాండ్‌, ఇల్లెందు బస్టాండ్‌నుంచి ఈ బస్సులు అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఇల్లెందు నుంచి 124, ఖమ్మం నుంచి 30బస్సులు అందుబాటులో ఉన్నాయన్నారు. జాతర పాయింట్‌ వద్ద ప్రయాణికులకు అన్ని వసతులు ఏర్పాటు చేశామని, ప్రయాణికులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని తెలిపారు. ఈ ప్రత్యేక బస్సులు. నేటినుంచి 25వ తేదీ వరకు అందుబాటులో ఉంటాయన్నారు. మేడారం జాతర సందర్భంగా కొన్ని పల్లె వెలుగు బస్సులు, ఎక్స్‌ప్రెస్‌ సర్వీసుల సంఖ్య తగ్గించటం జరిగిందని, ప్రయాణికులు గమనించాలని కోరారు.

Updated Date - Feb 18 , 2024 | 01:19 PM

Advertising
Advertising