Bhadrachalam: రామయ్య పట్టాభిషేకం.. మురిసిపోయిన భక్తజనం..
ABN, Publish Date - Apr 18 , 2024 | 05:17 PM
శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా దక్షిణ అయోధ్య భద్రాచలం ( Bhadrachalam )భక్తులతో సందడిగా మారింది. సీతారాముల కల్యాణం తర్వాత అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే శ్రీరామ మహా పట్టాభిషేక మహోత్సవం ఘనంగా జరిగింది.
శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా దక్షిణ అయోధ్య భద్రాచలం ( Bhadrachalam )భక్తులతో సందడిగా మారింది. సీతారాముల కల్యాణం తర్వాత అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే శ్రీరామ మహా పట్టాభిషేక మహోత్సవం ఘనంగా జరిగింది. పండితులు వేద మంత్రోచ్ఛరణలు ఆలపిస్తున్న వేళ రఘునందనుడు సింహాసనాన్ని అధిష్ఠించాడు. పట్టాభిషేకం మహోత్సవం సందర్బంగా ఉదయం నుంచే భద్రాచలం ఆలయ పరిసరాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. కల్యాణమూర్తులు మిథిలా ప్రాంగణానికి చేరుకోగానే శ్రీరామనామ స్మరణతో ఆ ప్రాంతమంతా మార్మోగింది. గోదావరి నుంచి తీసుకొచ్చిన పుణ్య జలాలను భక్తులపై చల్లి అర్చకులు ఆశీస్సులు అందించారు.
Mamata Banerjee: వారే దాడి చేసి వారే ఆరోపణలు చేస్తున్నారు.. మమతా స్ట్రాంగ్ కౌంటర్..
సీతారామచంద్రస్వామి వారి మహా పట్టాభిషేకం కార్యక్రమంలో తెలంగాణ గవర్నర్ రాధాకృష్ణన్ పాల్గొన్నారు. గవర్నర్ రాక సందర్భంగా అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. వేదాశీర్వచనాలిచ్చి తీర్థప్రసాదాలు, జ్ఞాపిక అందించారు. అనంతరం మిథిలా స్టేడియానికి చేరుకుని స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. భద్రాచలం సీతారామచంద్రస్వామిని దర్శించుకోవడం ఆనందంగా ఉందని గవర్నర్ తెలిపారు.
Kejriwal: ఉద్దేశపూర్వకంగానే కేజ్రీవాల్ మామిడిపండ్లు తింటున్నారు.. ఈడీ ఆరోపణ..
మరోవైపు.. సీతమ్మ సమేతంగా రాములవారు మిథిలా వేదికపై కొలువుదీరగా సీఎస్ శాంతకుమారి ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. మధ్యాహ్నం 12 గంటల శుభ ముహూర్తాన సీతమ్మ తలపై, రాములవారి తలపై జీలకర్ర బెల్లం పెట్టడంతో ఒక్కటయ్యారు. ఆ తర్వాత అభిజిత్ లగ్నంలో సీతమ్మ మెడలో రాములవారు మూడు ముళ్లూ వేశారు. ఈ కల్యాణాన్ని వీక్షించిన భక్తులు భక్తి పారవశ్యంలో మునిగిపోయారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.
Updated Date - Apr 18 , 2024 | 05:17 PM