Delhi: బోనాల ఉత్సవాల్లో పాల్గొన్న గవర్నర్ రాధాకృష్ణన్
ABN, Publish Date - Jul 10 , 2024 | 07:40 PM
ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో లాల్ దర్వాజా బోనాల ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో రాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ బుధవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన బోనం ఎత్తుకొని అమ్మవారికి సమర్పించారు.
న్యూఢిల్లీ, జులై 10: ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో లాల్ దర్వాజా బోనాల ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో రాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ బుధవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన బోనం ఎత్తుకొని అమ్మవారికి సమర్పించారు. అనంతరం తెలంగాణ గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ మాట్లాడుతూ.. దేవుడు ఒక్కడే అయినా.. భిన్న రూపాల్లో మనమంతా కొలుస్తామన్నారు. అదే సెక్యూలరిజానికి నిజమైన నిర్వచనమని ఆయన పేర్కొన్నారు.
తెలంగాణ బోనాల ఉత్సవాల్లో ఆ సంస్కృతి స్పష్టంగా కనిపిస్తుందని తెలిపారు. తాను రెండోసారి బోనాల ఉత్సవాల్లో పాల్గొన్నానని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసుకున్నారు. బోనాల సందర్భంగా తెలుగు రాష్ట్రాల ప్రజలకు గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ శుభాకాంక్షలు తెలిపారు. అంతకుముందు ఈ ఉత్సవాలకు హాజరయ్యేందుకు ఢిల్లీలోని తెలంగాణ భవన్‌కు వచ్చిన గవర్నర్ రాధాకృష్ణన్‌ను ఉత్సవ కమిటీ సభ్యులు ఘనంగా స్వాగతం పలికారు.
Also Read: Rs. 84 Crores: 108 కేజీల బంగారం సీజ్.. ఎక్కడంటే..?
Also Read: Ganta Srinivas Rao: సీఎం దృష్టికి గురుకుల సమస్యలు
Also Read: Minister Savitha: టీడీపీ హయాంలోనే రాష్ట్రాభివృద్ధి
Also Read: Pooja Khedkar : ట్రైయినీ ఐఏఎస్‌పై బదిలీ వేటు..
Also Read: Minister Savitha: టీడీపీ హయాంలోనే రాష్ట్రాభివృద్ధి
Read Latest Telangana News and National News
Read Latest AP News and Telugu News
Updated Date - Jul 10 , 2024 | 07:43 PM