Stock Market: ఇల్లు తాకట్టు పెట్టి స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు
ABN, Publish Date - Nov 18 , 2024 | 04:39 AM
స్టాక్ మార్కెట్‌లో లాభాలొస్తాయనే నమ్మకంతో ఓ యువకుడు తను దాచుకున్న డబ్బుతో పాటు ఇల్లు తాకట్టు పెట్టి మరీ పెట్టుబడులు పెట్టాడు.
రూ.35 లక్షల నష్టం.. మనస్తాపంతో యువకుడి ఆత్మహత్య
రాజన్న సిరిసిల్ల జిల్లా సింగారంలో ఘటన
ఎల్లారెడ్డిపేట, నవంబరు 17 (ఆంధ్రజ్యోతి): స్టాక్ మార్కెట్‌లో లాభాలొస్తాయనే నమ్మకంతో ఓ యువకుడు తను దాచుకున్న డబ్బుతో పాటు ఇల్లు తాకట్టు పెట్టి మరీ పెట్టుబడులు పెట్టాడు. చివరకు పెట్టిన డబ్బంతా నష్టపోయి మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం సింగారం గ్రామానికి చెందిన బండి స్వామి గౌడ్ (35) తన తండ్రి లక్ష్మి నారాయణతో కలిసి ఎల్లారెడ్డిపేటలో పాల కేంద్రాన్ని నిర్వహిస్తున్నాడు. అతడు కొన్ని రోజులుగా స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెడుతున్నాడు. వ్యాపారం చేస్తూ తను దాచుకున్న డబ్బుతో పాటు, స్వగ్రామంలోని తన ఇంటిని తాకట్టు పెట్టి మొత్తం రూ. 35 లక్షలు స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టాడు.
నష్టాలతో..
ఆ మొత్తం నష్టపోయాడు. దీంతో మనస్తాపం చెందిన స్వామి గౌడ్ ఈ నెల 9న పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబసభ్యులు వెంటనే ఎల్లారెడ్డిపేటలో ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. వారం రోజులుగా అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి ఆదివారం మృతి చెందాడు. స్వామి గౌడ్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. స్వామి గౌడ్ తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఇవి కూడా చదవండి:
Jiostar: మొదలైన జియోస్టార్.. రూ. 15కే డబుల్ డోస్ ఎంటర్ టైన్‌మెంట్
Personal Finance: నెలకు రూ. 5 వేలు సేవ్ చేస్తే.. రూ. 2 కోట్ల కోసం ఎన్నేళ్లు కట్టాలి..
PAN Aadhaar: పాన్ ఆధార్ ఇంకా లింక్ చేయలేదా.. ఇప్పుడే చేసుకోండి, గడవు సమీపిస్తోంది..
Read More Business News and Latest Telugu News
Updated Date - Nov 18 , 2024 | 07:10 AM