ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Phone Tapping: సెల్‌ఫోన్లలోని ‘గుట్టు’ రట్టు!

ABN, Publish Date - Nov 14 , 2024 | 05:00 AM

రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు విచారణలో అధికారులు సాంకేతిక ఆధారాలతో ముందుకెళ్తున్నారు. ఈ కేసులో అరెస్టయిన నిందితుల సెల్‌ఫోన్లలో చెరిపేసిన సమాచారాన్ని ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబొరేటరీ (ఎఫ్‌ఎ్‌సఎల్‌) నిపుణులు తిరిగి (రిట్రీవ్‌) రాబట్టారు.

  • చాట్‌ హిస్టరీని రిట్రీవ్‌ చేసిన ఎఫ్‌ఎస్‌ఎల్‌

  • నలుగురు పోలీసులతో గత ప్రభుత్వ నేతల సంభాషణ

  • ఎన్నికలు, ఇతర సందర్భాల్లో చేసిన చాటింగ్‌ బహిర్గతం

  • ఎఫ్‌ఎస్‌ఎల్‌ నివేదిక ఆధారంగా ట్యాపింగ్‌ కేసులో ముందుకు..

  • నేడు విచారణకు బీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే లింగయ్య

హైదరాబాద్‌, నవంబరు 13 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు విచారణలో అధికారులు సాంకేతిక ఆధారాలతో ముందుకెళ్తున్నారు. ఈ కేసులో అరెస్టయిన నిందితుల సెల్‌ఫోన్లలో చెరిపేసిన సమాచారాన్ని ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబొరేటరీ (ఎఫ్‌ఎ్‌సఎల్‌) నిపుణులు తిరిగి (రిట్రీవ్‌) రాబట్టారు. అందులో కీలక సంభాషణలు బయటపడడంతో వాటి ఆధారంగా కేసు దర్యాప్తులో రెండో అంకాన్ని ప్రారంభించారు. టాస్క్‌ఫోర్స్‌ డీసీపీగా పనిచేసిన రాధాకిషన్‌రావు, అదనపు ఎస్పీలు తిరుపతన్న, భుజంగరావు, డీఎస్పీ ప్రణీత్‌రావు నుంచి స్వాధీనం చేసుకున్న సెల్‌ఫోన్లను పరిశీలించిన ఎఫ్‌ఎ్‌సఎల్‌ బృందం.. నిందితులు డిలీట్‌ చేసిన సమాచారంలో చాలా వరకు తిరిగి రాబట్టినట్లు తెలుస్తోంది. ఓ వైపు కాల్‌ డేటా రికార్డు (సీడీఆర్‌), మరోవైపు ఎఫ్‌ఎ్‌సఎల్‌ నివేదికతో అధికారులు కేసు దర్యాప్తులో ముందుకెళ్తున్నారు. ట్యాపింగ్‌ కేసులో పట్టుబడ్డ నలుగురు అధికారులు గత ప్రభుత్వంలోని కొందరు ముఖ్య నాయకులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధుల ఆదేశాల మేరకు పనిచేసినతీరుపై ఆధారాలు లభించినట్లు తెలిసింది.


ప్రత్యేకంగా వాట్సాప్‌ గ్రూపులు ఏర్పాటు చేసుకొని, ‘పనులు’ పూర్తి చేసినట్లు గుర్తించారు. కొన్ని సందర్భాల్లో వ్యక్తిగతంగా వాట్సాప్‌, టెలిగ్రామ్‌, సిగ్నల్‌ మాధ్యమాల్లో సమాచారం ఇచ్చిపుచ్చుకున్నారు. రిట్రీవ్‌లో బయటపడ్డ చాట్‌ ఆధారంగా బీఆర్‌ఎస్‌ నాయకులతో ఫోన్‌ ట్యాపింగ్‌ నిందితులు జరిపిన సంభాషణల్ని అధికారులు గుర్తించారు. రెండో దశ విచారణలో భాగంగా బీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు సమన్లు జారీ చేశారు. గత సోమవారం విచారణకు హాజరుకావాల్సి ఉన్నా.. అనారోగ్యం కారణంగా గైర్హాజరయ్యారు. గురువారం తప్పకుండా విచారణకు వస్తానని దర్యాప్తు అధికారులకు సమాచారం ఇచ్చారు. లింగయ్య జూబ్లీహిల్స్‌ ఏసీపీ ఎదుట విచారణకు హాజరు కావాల్సి ఉంది. ప్రధానంగా ఈ కేసులో అరెస్టయిన తిరుపతన్నతో లింగయ్య జరిపిన వ్యవహారాలపై దర్యాప్తు అధికారులు ఆరా తీయనున్నారు. ఆయన కోసం ఇప్పటికే ప్రత్యేక ప్రశ్నావళిని రూపొందించారు. లింగయ్య ఇచ్చే సమాచారం ఆధారంగా కొందరికి నోటీసులు జారీ చేసేందుకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. హుజూరాబాద్‌ ఉప ఎన్నికతోపాటు గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో, ఇతర సందర్భాల్లో ప్రతిపక్ష నాయకులు, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారుల్ని లక్ష్యంగా చేసుకొని ట్యాపింగ్‌లు జరిపినట్లు ఇప్పటికే తేలింది. వచ్చే వారం ఉమ్మడి మహబూబ్‌నగర్‌, నల్లగొండ, కరీంనగర్‌కు చెందిన గత ప్రభుత్వ ముఖ్య నాయకులకు నోటీసులిచ్చి ప్రశ్నించనున్నట్లు సమాచారం.


  • భద్రత కల్పించండి -డీజీపీకి నందకుమార్‌ విజ్ఞప్తి

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలతో బీజేపీ నాయకుల బేరసారాల కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న నందకుమార్‌ అలియాస్‌ నందు తనకు భద్రత కల్పించాలని డీజీపీకి విజ్ఞప్తి చేశారు. నందకుమార్‌, ఇతర నిందితుల్ని అరెస్ట్‌ చేసిన సమయంలో అప్పటి సీఎం కేసీఆర్‌ స్వయంగా ప్రగతి భవన్‌లో ఆడియో టేపులు వినిపించారు. ఆ టేపులు ఫోన్‌ ట్యాపింగ్‌తో సేకరించినవేనని ఇదివరకే నందకుమార్‌ ఆరోపించడంతోపాటు దానిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇప్పుడు ట్యాపింగ్‌ కేసు దర్యాప్తులో దూకుడు పెరగడం, ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో తనకు భద్రత కల్పించాలని నందకుమార్‌ డీజీపీని కలిసి విజ్ఞప్తి చేశారు.

Updated Date - Nov 14 , 2024 | 05:00 AM