Hyderabad: జయశంకర్ వర్సిటీలో అదనంగా 200 సీట్లు
ABN, Publish Date - Oct 22 , 2024 | 04:54 AM
ప్రస్తుత విద్యా సంవత్సరంలో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ప్రత్యేక కోటా కింద అదనంగా 200 సీట్లను బీఎస్సీ(ఆనర్స్) వ్యవసాయ కోర్సులో పెంచుతున్నట్లు వర్సిటీ వీసీ ప్రొఫెసర్ ఆల్దాస్ జానయ్య ప్రకటించారు.
జయశంకర్ వర్సిటీలో అదనంగా 200 సీట్లు8 బీఎస్సీ ఆనర్స్ కోర్సులో ప్రత్యేక కోటా కింద పెంపు
రూ.10 లక్షల కోర్సు ఫీజు రూ.5 లక్షలకు తగ్గింపు
హైదరాబాద్/రాజేంద్రనగర్, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి): ప్రస్తుత విద్యా సంవత్సరంలో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ప్రత్యేక కోటా కింద అదనంగా 200 సీట్లను బీఎస్సీ(ఆనర్స్) వ్యవసాయ కోర్సులో పెంచుతున్నట్లు వర్సిటీ వీసీ ప్రొఫెసర్ ఆల్దాస్ జానయ్య ప్రకటించారు. ఈ సీట్లను కౌన్సెలింగ్ ద్వారానే భర్తీ చేస్తామని సోమవారం ప్రకటనలో వెల్లడించారు. ప్రస్తుతం ప్రత్యేక కోటాలో ఉన్న బీఎస్సీ(ఆనర్స్) వ్యవసాయ కోర్సుకు 4 ఏళ్లకు కలిపి రూ. 10 లక్షల ఫీజు ఉండగా... దాన్ని రూ. 5 లక్షలకు తగ్గించినట్లు తెలిపారు.
అలాగే ప్రవేశ సమయంలో ఒకేసారి రూ. 3 లక్షలు చెల్లించాలనే నిబంధన ఉండగా.. దానిని రూ. 65 వేలకు తగ్గించినట్లు వెల్లడించారు. పెంచుతున్న సీట్ల వివరాలను యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో రెండు, మూడు రోజుల్లో అందుబాటులో ఉంచుతామని వివరించారు. ప్రస్తుతం వ్యవసాయ వర్సిటీ వీసీగా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య... సోమవారం గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను మర్యాద పూర్వకంగా కలిశారు.
Updated Date - Oct 22 , 2024 | 04:54 AM