ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

‘మత్తు’పై ప్రచారాస్త్రం..!

ABN, Publish Date - Oct 23 , 2024 | 06:08 AM

గంజాయి, డ్రగ్స్‌, ఇతర మత్తు పదార్ధాలపై ఉక్కుపాదం మోపాలన్న రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు తెలంగాణ యాంటీ నార్కొటిక్స్‌ బ్యూరో(టీజీ న్యాబ్‌) విస్తృతంగా ప్రచారం చేయాలని నిర్ణయించుకుంది.

  • ప్రతిరోజు 5 వేల మందికి అవగాహన

హైదరాబాద్‌, అక్టోబరు 22 (ఆంధ్రజ్యోతి): గంజాయి, డ్రగ్స్‌, ఇతర మత్తు పదార్ధాలపై ఉక్కుపాదం మోపాలన్న రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు తెలంగాణ యాంటీ నార్కొటిక్స్‌ బ్యూరో(టీజీ న్యాబ్‌) విస్తృతంగా ప్రచారం చేయాలని నిర్ణయించుకుంది. ఇప్పటివరకు విద్యాసంస్థలు, రద్దీ ప్రాంతాల్లో మాత్రమే చేపట్టిన అవగాహన కార్యక్రమాలను రాష్ట్రవ్యాప్తంగా విస్తరించనుంది. ఇందుకుగాను ఎక్కడికక్కడ స్థానిక పోలీసులు, ఆశావర్కర్లు, అంగన్‌వాడీలు, ఆరోగ్యశాఖ ఇతర ప్రభుత్వ విభాగాలు, ఎన్జీవోల సహకారం సైతం తీసుకుంటున్నారు. ప్రతిరోజు సగటున 5 వేల మందికి మత్తు పదార్ధాల వాడకం వల్ల ఎదురయ్యే ఆరోగ్య సమస్యలు, చట్టప్రకారంగా ఎదుర్కొనే ఇబ్బందులపై అవగాహన కల్పించనున్నారు.

Updated Date - Oct 23 , 2024 | 06:08 AM