Telangana Assembly: మరికొద్ది సేపట్లో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం..!
ABN, Publish Date - Jul 23 , 2024 | 11:21 AM
మరికొద్ది సేపట్లో తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీకి చేరుకున్నారు. ఇక, టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ గన్‌పార్క్‌కు చేరుకుని అమరవీరులకు నివాళులర్పించారు.
మరికొద్ది సేపట్లో తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీకి చేరుకున్నారు. ఇక, టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ గన్‌పార్క్‌కు చేరుకుని అమరవీరులకు నివాళులర్పించారు. మరోవైపు బీజేపీ నేతలు కూడా అమర వీరుల స్థూపానికి నివాళులు అర్పించేందుకు గన్‌పార్క్‌కు చేరుకున్నారు. బీజేపీ ఎమ్మెల్యేలు బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో అమరవీరులకు నివాళులు అర్పించారు.
ప్రజా వ్యతిరేక ప్రభుత్వం నశించాలని, రైతులను మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం నశించాలని బీజేపీ ఎమ్మెల్యేలు నినాదాలు చేశారు. కాగా, బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ మెదటి రోజు అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉండబోతున్నారు. మధ్యప్రదేశ్ లో ముందే నిర్ణయించిన కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లాల్సి రావడంతో రాజా సింగ్ తొలి రోజు అసెంబ్లీ సమావేశాలకు దూరం కానున్నారు. బుధవారం నుంచి జరిగే సమావేశాలకు రాజా సింగ్ అందుబాటులో ఉండనున్నారు.
Updated Date - Jul 23 , 2024 | 11:21 AM