ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Cabinet Meeting: 26కు క్యాబినెట్‌ భేటీ వాయిదా...

ABN, Publish Date - Oct 20 , 2024 | 03:09 AM

ఈ నెల 23న నిర్వహించాలనుకున్న తెలంగాణ మంత్రివర్గ సమావేశం 26వ తేదీకి వాయిదా పడింది.

హైదరాబాద్‌, అక్టోబరు 19 (ఆంధ్రజ్యోతి): ఈ నెల 23న నిర్వహించాలనుకున్న తెలంగాణ మంత్రివర్గ సమావేశం 26వ తేదీకి వాయిదా పడింది. దక్షిణ కొరియాలోని సియోల్‌ నగరంలో హన్‌ నదిని అభివృద్ధి చేసిన తీరును పరిశీలించేందుకు మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి, పొన్నం ప్రభాకర్‌ వెళ్లిన నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. మంత్రులు సియోల్‌ పర్యటనకు శనివారం వెళ్లగా.. ఈ నెల 25న తిరిగి హైదరాబాద్‌కు చేరుకోనున్నారు.


ఈసారి మంత్రివర్గ సమావేశంలో కొత్త ఆర్వోఆర్‌ ముసాయిదా బిల్లుపై చర్చించనున్నారు. రెవెన్యూశాఖ మంత్రి లేకుండా కీలకమైన ఈ బిల్లుపై చర్చించడం సరికాదని భావించి మంత్రివర్గ సమావేశాన్ని ఈ నెల 26కు సీఎం రేవంత్‌రెడ్డి వాయిదా వేశారు.

Updated Date - Oct 20 , 2024 | 03:09 AM