మార్చి 21 నుంచి టెన్త్ పరీక్షలు
ABN, Publish Date - Dec 20 , 2024 | 04:14 AM
పదో తరగతి వార్షిక పరీక్షలు వచ్చే ఏడాది మార్చి 21 నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు జరిగే ఈ పరీక్షల షెడ్యూల్‌ను అఽధికారులు గురువారం విడుదల చేశారు.
రెండు రోజుల పాటు సైన్స్ పేపర్ పరీక్షలు
షెడ్యూల్‌ను విడుదల చేసిన అధికారులు
హైదరాబాద్, డిసెంబరు 19 (ఆంధ్రజ్యోతి) : పదో తరగతి వార్షిక పరీక్షలు వచ్చే ఏడాది మార్చి 21 నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు జరిగే ఈ పరీక్షల షెడ్యూల్‌ను అఽధికారులు గురువారం విడుదల చేశారు. వీటిని ఆరు పేపర్లతో నిర్వహిస్తుండగా, సైన్స్ పేపర్ పరీక్షను మాత్రం రెండు రోజుల పాటు నిర్వహించనున్నారు. రాష్ట్రంలో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు మార్చి 5 నుంచి 19వ తేదీల మధ్య జరుగనున్న విషయం తెలిసిందే. ఈ పరీక్షలు ముగిసిన వెంటనే టెన్త్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. మార్చి 21న ప్రారంభమయ్యే టెన్త్ పరీక్షలు ఏప్రిల్ 2తో ముగియనున్నాయి. అయితే.. ఏప్రిల్ 3,4వ తేదీల్లో టెన్త్ ఒకేషనల్ పరీక్షలు జరుగనున్నాయి. ఈ పరీక్షలన్నీ కూడా ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు జరుగుతాయి. అయితే, సైన్స్ పేపర్ల పరీక్షలు మాత్రం ఉదయం 9.30 నుంచి 11.30 గంటల వరకు నిర్వహిస్తారు. విద్యార్థులు అబ్జెక్టివ్ పేపర్ జవాబులను చివరి అర్ధగంటలో మాత్రమే రాయాల్సి ఉంటుంది. అయితే, సైన్స్ అబ్జెక్టివ్ పేపర్‌ను మాత్రం చివరి 15 నిమిషాల్లో రాయాల్సి ఉంటుందని అధికారులు ప్రకటించారు.
పదో తరగతి వార్షిక పరీక్షల షెడ్యూల్ వివరాలు
తేదీ పరీక్ష పేరు
21-03-2025 ఫస్ట్ లాంగ్వేజి
22-03-2025 సెకండ్ లాంగ్వేజి
24-03-2025 థర్డ్ లాంగ్వేజి
26-03-2025 మ్యాథమేటిక్స్
28-03-2025 ఫిజికల్ సైన్స్
29-03-2025 బయోలాజికల్ సైన్స్
02-04-2025 సోషల్ స్టడీస్
Updated Date - Dec 20 , 2024 | 04:14 AM