Revanth Reddy: రైతుల సంక్షేమం కోసమే పోచారం కాంగ్రెస్‌లో చేరిక
ABN, Publish Date - Jun 21 , 2024 | 01:00 PM
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy) సమక్షంలో మాజీ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి(Pocharam srinivas reddy) కాంగ్రెస్(congress) పార్టీలో చేరారు. ఈ నేపథ్యంలో మాట్లాడిన రేవంత్ రెడ్డి రైతుల సంక్షేమం కోసమే పోచారం కాంగ్రెస్ పార్టీలో చేరారని తెలిపారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy) సమక్షంలో మాజీ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి(Pocharam srinivas reddy) కాంగ్రెస్(congress) పార్టీలో చేరారు. దీంతో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను పార్టీలోకి ఆహ్వానించేందుకు కాంగ్రెస్ ‘ఆకర్ష్’ ఆపరేషన్ ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా రేవంత్ ఇంటి దగ్గర జరిగిన ఈ భేటీలో దేవాదాయ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సహా పలువురు నేతలు పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో మాట్లాడిన రేవంత్ రెడ్డి రైతుల సంక్షేమం కోసమే పోచారం కాంగ్రెస్ పార్టీలో చేరారని తెలిపారు.
తెలంగాణ పునర్నిర్మాణంలో భాగంగా పోచారం శ్రీనివాస్ రెడ్డిని కలిసామని, పెద్దలుగా అండగా నిలబడాలని కోరినట్లు రేవంత్(Revanth Reddy) చెప్పారు. రైతుల సంక్షేమంపై వారి సలహాలు సూచనలు తీసుకుని ముందుకెళతామని ఈ సందర్భంగా రేవంత్ వెల్లడించారు. రైతులకు సంబంధించి భవిష్యత్తులో ఎలాంటి విధాన నిర్ణయం తీసుకున్నా కాంగ్రెస్ ప్రభుత్వం తన సలహా తీసుకుంటుందని చెప్పారు. నిజామాబాద్‌లో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు పోచారం శ్రీనివాస్‌రెడ్డి సహకారం తీసుకుంటామన్నారు. ఆయనకు తగిన పదవి కూడా వస్తుందని, రైతులకు రుణమాఫీ చేసేందుకు మార్గదర్శకాలను రూపొందించడంపై నేటి మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
రైతులకు రేవంత్ మంచి చేస్తున్నాడని పోచారం శ్రీనివాస్ రెడ్డి(Pocharam srinivas reddy) పార్టీలో చేరిన క్రమంలో వెల్లడించారు. రేవంత్ చేస్తున్న రైతు అనుకూల నిర్ణయాలకు రైతు బిడ్డగా గర్విస్తున్నానని చెప్పారు. రేవంత్ యువకుడు ఇంకా 20 ఏండ్లు రాష్ట్రాన్ని పాలిచ్చే సత్తా రేవంత్‌కి ఉందని పోచారం అభిప్రాయం వ్యక్తం చేశారు. తాను ఎన్నో పదవులు అనుభవించానని ఈ సందర్భంగా గుర్తు చేశారు.
2023 అసెంబ్లీ ఎన్నికల్లో బాన్సువాడ(banswada) అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి ఏనుగు రవీందర్ రెడ్డిపై పోచారం శ్రీనివాస్ రెడ్డి 23,464 ఓట్ల తేడాతో గెలుపొందారు. పోచారం శ్రీనివాస్ రెడ్డి గతంలో 2019 జనవరి నుంచి 2023 వరకు తెలంగాణ శాసనసభ స్పీకర్‌గా పనిచేశారు. బీఆర్‌ఎస్ హయాంలో 2014 నుంచి 2019 వరకు వ్యవసాయ శాఖ మంత్రిగా కూడా పనిచేశారు.
ఇది కూడా చదవండి:
Hyderabad: బాల్క సుమన్ అత్యుత్సాహం..పోలీసులతో గొడవ, అరెస్ట్
Pocharam Srinivas Reddy: మిగిలేది ఆ నలుగురేనా..? కాంగ్రెస్‌లోకి పోచారం
Balkampeta Ellamma: 9న బల్కంపేట ఎల్లమ్మ కల్యాణం..
Read Latest Telangana News and National News
Updated Date - Jun 21 , 2024 | 01:03 PM