CM Revanth: బానిసత్వాన్ని తెలంగాణ భరించదు
ABN, Publish Date - Jun 02 , 2024 | 11:12 AM
తెలంగాణ అస్థిత్వానికి, ఆత్మగౌరవానికి పట్టాభిషేకం జరిగి పదేళ్లు అవుతోందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రాణాలర్పించిన అమరులకు నివాళులర్పించారు. ఆరు దశాబ్దాల కలను నెరవేర్చిన ఆ నాటి ప్రధాని మన్మోహన్ సింగ్, యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీకి కృతజ్ఞతలు తెలిపారు.
హైదరాబాద్: తెలంగాణ అస్థిత్వానికి, ఆత్మగౌరవానికి పట్టాభిషేకం జరిగి పదేళ్లు అవుతోందని సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) అన్నారు. ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రాణాలర్పించిన అమరులకు నివాళులర్పించారు. ఆరు దశాబ్దాల కలను నెరవేర్చిన ఆ నాటి ప్రధాని మన్మోహన్ సింగ్, యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీకి కృతజ్ఞతలు తెలిపారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగిన ఆవిర్భావ వేడుకల్లో ఆయన మాట్లాడారు.
యువత కోరుకున్నట్టుగా
బానిసత్వాన్ని తెలంగాణ భరించదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ యువత కోరుకున్నట్టుగా టీఎస్ స్థానంలో టీజీ ఏర్పాటు చేశామని వివరించారు. తమ ప్రభుత్వం అధికారం చేపట్టే సమయానికి రాష్ట్రం 7 లక్షల కోట్ల అప్పుల్లో ఉందని రేవంత్ గుర్తుచేశారు. రాష్ట సంపద పెంచడం, ఆర్థిక పునరుజ్జీవనం సాధించడం కోసం కృషి చేస్తున్నామని స్పష్టం చేశారు. తెలంగాణ అభివృద్ధికి కంకణబద్దులై పనిచేస్తున్నామని వివరించారు.
మూడు జోన్లుగా విభజన
తెలంగాణ రాష్ట్రాన్ని మూడు జోన్లుగా విభజిస్తున్నామని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. హైదరాబాద్ నుంచి ఔటర్ రింగ్ రోడ్ వరకు అర్బన్ తెలంగాణగా ఉంటుందని వివరించారు. ఔటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ వరకు సబర్బన్ తెలంగాణ అని.. రీజనల్ రింగ్ రోడ్ నుంచి తెలంగాణ సరిహద్దు వరకు గల ప్రాంతాన్ని గ్రామీణ తెలంగాణగా పరిగణిస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
Updated Date - Jun 02 , 2024 | 11:43 AM