Winter Weather: వణికిస్తున్న చలి పులి..!
ABN, Publish Date - Oct 26 , 2024 | 04:45 AM
రాష్ట్రంలో చలి ప్రభావం మొదలైంది. కొన్ని జిల్లాల్లో రాత్రిపూట ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి.
హైదరాబాద్, అక్టోబరు 25 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో చలి ప్రభావం మొదలైంది. కొన్ని జిల్లాల్లో రాత్రిపూట ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. బుధవారం రాత్రి సంగారెడ్డి, వికారాబాద్, ఆసిఫాబాద్ జిల్లాల్లో ఉష్ణోగ్రత 16 డిగ్రీలకు చేరుకుంది. మరో డిగ్రీ తగ్గితే చలి తీవ్రతకు యెల్లో అలెర్ట్ జారీ చేస్తారు. అక్టోబరు చివరివారంలోనే ఇలా ఉంటే మున్ముందు ఇంకెలా ఉంటుందోనని భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.
రాగల మూడ్రోజులు కనిష్ట ఉష్ణోగ్రతలు 17-22 డిగ్రీల మధ్య నమోదవుతాయని, పగటిపూట గరిష్ఠ ఉష్ణోగ్రతలు 30-33 డిగ్రీల మధ్య నమోదవుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
Updated Date - Oct 26 , 2024 | 04:45 AM