ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Winter Weather: చలి పులి పంజా!

ABN, Publish Date - Nov 26 , 2024 | 03:58 AM

రాష్ట్రంలో చలి తీవ్రత పెరుగుతోంది. రోజురోజుకు ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ఉదయం, సాయంత్రం వేళల్లో బయటకు రావాలంటేనే జనం జంకుతున్నారు. తెల్లవారు జామున పొగమంచు రోడ్లను కప్పేస్తోంది.

  • సిర్పూర్‌లో 8.3, కోహీర్‌లో 8.8 డిగ్రీలు.. ఒకరి మృతి

(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌): రాష్ట్రంలో చలి తీవ్రత పెరుగుతోంది. రోజురోజుకు ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ఉదయం, సాయంత్రం వేళల్లో బయటకు రావాలంటేనే జనం జంకుతున్నారు. తెల్లవారు జామున పొగమంచు రోడ్లను కప్పేస్తోంది. ఏజెన్సీ ప్రాంతాల్లో చలి తీవ్రత మరి ఎక్కువగా ఉంది. ఆసిఫాబాద్‌ జిల్లా సిర్పూర్‌లో 8.3 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. సంగారెడ్డి జిల్లా కోహీర్‌లో 8.8, న్యాల్‌కల్‌లో 9.6, కంగ్టిలో 9.8, ఆదిలాబాద్‌ జిల్లా బేలలో 9.9 డిగ్రీలుగా రికార్డయింది. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో చాలా చోట్ల 10 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.


ఇటు హైదరాబాద్‌లో పటాన్‌చెరు ప్రాంతంలో 11.2 డిగ్రీలు రికార్డయింది. రాష్ట్రవ్యాప్తంగా రాగల మూడ్రోజుల పాటు చలి తీవ్రత ఎక్కువగా ఉంటుందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మూడ్రోజులకు యె ల్లో అలెర్ట్‌ జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. కాగా, చలిని తట్టుకోలేక గుర్తు తెలియని నడి వయసు మహిళ మృతి చెందిన ఘటన హైదరాబాద్‌లోని చాదర్‌ఘాట్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. చాదర్‌ఘాట్‌ చౌరస్తాలోని సవేరా హోటల్‌ వద్ద ఓ మహిళ రోడ్డు పక్కన పడి ఉండటంతో స్థానికులు పోలీసులకు స మాచారమిచ్చారు. దీంతో వారు అక్కడికి చేరుకొని పరిశీలించగా.. ఆ మె ప్రాణాలతో లేదు. అయితే ఆమె చలికి తట్టుకోలేక అనారోగ్యంతో మృతి చెంది ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.

Updated Date - Nov 26 , 2024 | 03:58 AM