State Festival: సదర్ ఉత్సవం..అధికారికం
ABN, Publish Date - Nov 03 , 2024 | 03:19 AM
దీపావళి సందర్భంగా నిర్వహించే సదర్ సమ్మేళన్‌ను రాష్ట్ర పండుగగా గుర్తిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
రాష్ట్ర పండుగగా గుర్తింపు
ప్రభుత్వ ఉత్తర్వులు జారీ
హైదరాబాద్‌లో జీహెచ్‌ఎంసీ
కమిషనర్‌కు పర్యవేక్షణ బాధ్యత
జిల్లాల్లో కలెక్టర్లకు అప్పగింత
హైదరాబాద్, నవంబరు 2 (ఆంధ్రజ్యోతి): దీపావళి సందర్భంగా నిర్వహించే సదర్ సమ్మేళన్‌ను రాష్ట్ర పండుగగా గుర్తిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక నుంచి ప్రతి యేటా సదర్ సమ్మేళన్‌ను రాష్ట్ర పండుగగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని ప్రభుత ్వం జిల్లా కలెక్టర్లకు సూచించింది.
హైదరాబాద్‌లో జీహెచ్‌ఎంసీ కమిషనర్ సదర్ సమ్మేళన్ వేడుకల ఏర్పాట్లను పర్యవేక్షించనున్నారు. దీపావ ళి పండుగ తర్వాత రోజున పశుపాలకులు దున్నపోతులను అలంకరించి ఆడుతూ-పాడుతూ సదర్ సమ్మేళన్ నిర్వహించడం తెలంగాణలో సంప్రదాయంగా వస్తోంది.
Updated Date - Nov 03 , 2024 | 03:19 AM