ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Damodar Rajnarsimha: సెకండరీ హెల్త్‌కేర్‌ డైరెక్టరేట్‌గా టీవీవీపీ..?

ABN, Publish Date - Nov 30 , 2024 | 04:35 AM

తెలంగాణ వైద్య విధాన పరిషత్‌ను డైరెక్టర్‌ ఆఫ్‌ సెకండరీ హెల్త్‌ కేర్‌ విభాగంగా మార్చాలని సర్కారు భావిస్తోంది. వచ్చే మంత్రి మండలి సమావేశంలో దీనికి ఆమోద ముద్ర వేసే అవకాశం కనిపిస్తోంది.

  • కొడంగల్‌, సుల్తాన్‌పూర్‌లో సైన్స్‌ కేంద్రాలు: మంత్రి దామోదర

హైదరాబాద్‌, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ వైద్య విధాన పరిషత్‌ను డైరెక్టర్‌ ఆఫ్‌ సెకండరీ హెల్త్‌ కేర్‌ విభాగంగా మార్చాలని సర్కారు భావిస్తోంది. వచ్చే మంత్రి మండలి సమావేశంలో దీనికి ఆమోద ముద్ర వేసే అవకాశం కనిపిస్తోంది. దీనిపై అధికారులు రూపొందించిన పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ను వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్‌ రాజనర్సింహ పరిశీలించారు. శుక్రవారం సచివాలయంలో ఉన్నతాఽధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఇందులో ప్రజారోగ్య శాఖ ఆధ్వర్యంలోని ప్రాథమిక ఆసుపత్రిలో అందిస్తున్న ేసవలపై మంత్రి చర్చించారు. సీజనల్‌ వ్యాధులు విస్తరించకుండా ప్రాథమిక ఆసుపత్రులలో అవసరమైన సిబ్బంది, మందులు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలని మంత్రి అధికారులను ఆదేశించారు.


కాగా, కొడంగల్‌, సుల్తాన్‌పూర్‌ జేఎన్‌టీయూ క్యాంప్‌సలలో ప్రతిష్టాత్మక ‘సైన్స్‌ సెంటర్‌’లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు శుక్రవారం జీవో జారీ చేసింది. తెలంగాణ కౌన్సిల్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ ఆఽధ్వర్యంలో అండర్‌ కేటగిరిలో ఒక్కొ సైస్స్‌ కేంద్రాన్ని రూ.6.65 కోట్లతో ఏర్పాటు చేయనున్నట్లు ఆ జీవోలో పేర్కొంది. ఈ సైన్స్‌ సెంటర్లు విద్యార్థులకు ఫిజికల్‌ సైన్స్‌, మ్యాథమెటిక్స్‌, ఎలక్ర్టానిక్స్‌, లైఫ్‌ సెన్సెస్‌, కెమిస్ర్టీ, కంప్యూటర్‌ సైన్స్‌, అండ్‌ ఐటీ రంగాలలో ఉన్న విద్యార్థులు తమ ప్రతిభను మెరుగు పరుచుకోవడానికి ఎంతో ఉపయోగపడతాయని మంత్రి దామోదర్‌ రాజనర్సింహ వెల్లడించారు. కాగా, మంత్రి రాజనర్సింహతో భారత్‌లోని తుర్కియే రాయబారి ఫిరాట్‌ సునెల్‌ సచివాలయంలో సమావేశమయ్యారు. మెడికల్‌ ఫ్యాకల్టీ, మెడికల్‌ మౌలిక సదుపాయాల కల్పనలో సహకారంపై చర్చించారు.

Updated Date - Nov 30 , 2024 | 04:35 AM