RV Karnan: విచ్చలవిడి యాంటీ బయాటిక్స్‌తో ముప్పే
ABN, Publish Date - Nov 23 , 2024 | 05:15 AM
పెద్దఎత్తున పెరుగుతున్న యాంటీ బయాటిక్స్ వినియోగం ప్రభుత్వాలకు తీవ్ర ఆందోళన కలిగిస్తున్న అంశమని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్ ఆర్‌వీ.కర్ణన్ అన్నారు. దీనిపై ప్రజల్లో పెద్దఎత్తున అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.
వైద్యశాఖ కమిషనర్ ఆర్‌వీ.కర్ణన్
హైదరాబాద్, నవంబర్ 22(ఆంధ్రజ్యోతి): పెద్దఎత్తున పెరుగుతున్న యాంటీ బయాటిక్స్ వినియోగం ప్రభుత్వాలకు తీవ్ర ఆందోళన కలిగిస్తున్న అంశమని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్ ఆర్‌వీ.కర్ణన్ అన్నారు. దీనిపై ప్రజల్లో పెద్దఎత్తున అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ యాంటీమ్రైకోబియల్ రెసిస్టెన్స్ సొల్యూషన్స్ (ఐకార్స్), ఐఎ్‌సబీలోని మ్యాక్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్‌కేర్ మేనేజ్మెంట్ సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం ఐఎ్‌సబీలో సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న కర్ణన్ మాట్లాడుతూ యాంటీ బయాటిక్స్ వినియోగాన్ని తగ్గించడం లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రత్యేకంగా ఏఎంఆర్ (యాంటీమైక్రోబయాల్ నిరోధకత) కార్యాచరణ అమలుచేస్తోందన్నారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలతోపాటు వైద్య రంగంలోని శాస్త్రవేత్తలు, నిపుణులందరినీ సంప్రదించి తమ కార్యాచరణ ప్రకటించనున్నట్టు ఐకార్స్ సలహాదారుడు డాక్టర్ జ్యోతి జోషి అన్నారు.
Updated Date - Nov 23 , 2024 | 05:15 AM