ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Sridhar Babu: ఐటీ ఎగుమతుల్లో తెలంగాణ ఫస్ట్‌

ABN, Publish Date - Oct 19 , 2024 | 04:55 AM

ఐటీ ఎగుమతుల వృద్ధిలో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో ఉందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు తెలిపారు.

  • టి-హబ్‌తో 8 అంతర్జాతీయ సంస్థల ఒప్పందాలు : శ్రీధర్‌ బాబు

హైదరాబాద్‌, అక్టోబరు 18 (ఆంధ్రజ్యోతి): ఐటీ ఎగుమతుల వృద్ధిలో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో ఉందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు తెలిపారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలో ఐటీ ఎగుమతులు రూ.2.68 లక్షల కోట్లకు చేరాయని, అంతకుముందు ఏడాదితో పోలిస్తే వృద్ధిరేటు 11.2 శాతంగా నమోదైందన్నారు. జీసీసీ ఇన్నోవేషన్‌ సమిట్‌ శుక్రవారం టి-హబ్‌లో ప్రారంభమైంది. ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి మాట్లాడుతూ.. ఐటీ ఎగుమతుల వృద్ధిలో గ్లోబల్‌ కెపబిలిటీ సెంటర్ల (జీసీసీ) పాత్ర అత్యంత కీలకమన్నారు. హైదరాబాద్‌లో ఉన్న అనేక అంతర్జాతీయ, జాతీయ ఐటీ దిగ్గజ కంపెనీలు ఇప్పటికే జీసీసీలను నెలకొల్పాయన్నారు.


హైదరాబాద్‌ కేంద్రంగా ఉన్న పలు ఐటీ కంపెనీలు ఇప్పటికే తమ క్యాంప్‌సలను ద్వితీయ శ్రేణి నగరాలకు విస్తరించాయని, వీటి సంఖ్య త్వరలో పెద్దఎత్తున పెరగనుందని తెలిపారు. జీసీసీ ఇన్నోవేషన్‌ సమిట్‌లో భాగంగా 8 జాతీయ, అంతర్జాతీయ ఐటీ దిగ్గజ కంపెనీలు మంత్రి శ్రీధర్‌బాబు సమక్షంలో టి-హబ్‌తో పరస్పర అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఇందులో మెడ్‌ట్రానిక్‌, కెనడాలోని టొరంటో బిజినెస్‌ డెవల్‌పమెంట్‌ సెంటర్‌, ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలకా్ట్రనిక్‌ ఇంజనీర్స్‌ (ఐఈఈఈ), సమిట్‌ కన్సల్టింగ్‌ సర్వీసెస్‌, ట్రాన్సిషన్‌ వీసీ, ఫియూజీ, న్యూ రిలిక్‌, పేయూ ఉన్నాయి. కార్యక్రమంలో ఐటీ, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్‌ రంజన్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 19 , 2024 | 04:55 AM