40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Ponnam Prabhakar: బీఆర్ఎస్ - బీజేపీ ఒక్కటే అంటే ఇన్నాళ్లు కొందరు నమ్మలేదు: పొన్నం ప్రభాకర్

ABN, Publish Date - Jan 14 , 2024 | 04:01 PM

బీజేపీ లీడర్ బండి సంజయ్ కు మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్ వేశారు. తమ ప్రభుత్వాన్ని ముట్టుకునే ధైర్యం ఉందా ప్రశ్నించిన ఆయన..

Ponnam Prabhakar: బీఆర్ఎస్ - బీజేపీ ఒక్కటే అంటే ఇన్నాళ్లు కొందరు నమ్మలేదు: పొన్నం ప్రభాకర్

హైదరాబాద్: తెలంగాణ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నం ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీ త్వరలోనే రెండుగా చీలిపోతుందని అన్నారు. బీజేపీ, బీఆర్ఎస్‌లకు ఒక పార్టీకి సంబంధించిన సమాచారం మరో పార్టీకి తెలుసునని అన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్లాన్స్ వేస్తున్నారంటూ ఆదివారం ఉదయం బీజేపీ నేత బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలకు పొన్నం ప్రభాకర్ కౌంటర్ ఇచ్చారు.

కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ముట్టుకునే ధైర్యం ఉందా అని బీఆర్ఎస్, బీజేపీ నేతలకు ఆయన సవాలు విసిరారు. ప్రభుత్వాన్ని కూల్చే సాహసం ఎవరూ చేయలేరని అన్నారు. కాంగ్రెస్ పార్టీ బలహీనంగా ఏమీ లేదని స్పష్టం చేశారు. ‘‘ బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే అంటే ఇన్నాళ్లు కొందరు నమ్మలేదు కానీ బండి సంజయ్ వ్యాఖ్యల వల్ల ఇప్పుడు అందరూ నమ్ముతున్నారు’’ అని మంత్రి విమర్శల గుప్పించారు.


మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, వినోద్, సంజయ్‌లు ఏం చేశారని పొన్న ప్రభాకర్ ప్రశ్నించారు. ఈ అంశంపై చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. ‘‘ బండి సంజయ్ ఏమైనా జ్యోతిష్యం చదివారా మా పార్టీ ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారో మీకెందుకు?. ఇక్కడ కాంగ్రెస్ ఉంది. కేంద్రంలోనూ కాంగ్రెస్ రావాలి’’ అని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

Updated Date - Jan 14 , 2024 | 04:36 PM

Advertising
Advertising