ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Uttam Kumar Reddy: రైతులను పూజించే ప్రభుత్వం మాది..

ABN, Publish Date - Dec 14 , 2024 | 04:00 AM

రైతులను పూజించే ప్రభుత్వం తమదని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి అన్నారు. ఇక నుంచి పంట బీమాతో పాటు సంక్రాంతి తర్వాత రైతు భరోసా నిధులు విడుదల చేసి రైతుల ఖాతాలో జమ చేస్తామని చెప్పారు.

సంక్రాంతి తర్వాత రైతు భరోసా.. కాలువలు తెగితే అధికారులపై చర్యలు.. ఐదేళ్లపాటు సన్నాలకు 500 బోనస్‌

  • త్వరలోనే కొత్త రేషన్‌ కార్డులు, సన్న బియ్యం పంపిణీ: ఉత్తమ్‌

  • నిజాంసాగర్‌ నీటిని విడుదల చేసిన మంత్రి

(నిజాంసాగర్‌ నుంచి ఆంధ్రజ్యోతి ప్రత్యేక ప్రతినిధి)/నిజాంసాగర్‌/ముప్కాల్‌/హుజూర్‌నగర్‌/మేళ్లచెర్వు, డిసెంబరు 13 (ఆంధ్రజ్యోతి): రైతులను పూజించే ప్రభుత్వం తమదని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి అన్నారు. ఇక నుంచి పంట బీమాతో పాటు సంక్రాంతి తర్వాత రైతు భరోసా నిధులు విడుదల చేసి రైతుల ఖాతాలో జమ చేస్తామని చెప్పారు. మానవ తప్పిదాలతో కాలువలు తెగితే ఊరుకోమని, సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కొత్త లష్కర్‌లను నియమించబోతున్నామన్నారు. త్వరలోనే 1,300 మంది ఉద్యోగాలను భర్తీ చేయనున్నామని, దీనికోసం నియామక ప్రక్రియ చేపట్టాలని టీజీపీఎస్సీకి లేఖ రాశామని తెలిపారు. శుక్రవారం ఆయన కామారెడ్డి జిల్లాలోని నిజాంసాగర్‌ ప్రాజెక్టు నీటిని ఎమ్మెల్యేలు సుదర్శన్‌రెడ్డి, లక్ష్మీకాంతారావు, ప్రభుత్వ సలహాదారు పోచారం శ్రీనివా్‌సరెడ్డిలతో కలిసి విడుదల చేశారు. ఆ తర్వాత శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టును మంత్రి సందర్శించారు. అనంతరం సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌ నియోజకవర్గంలో చింతలపాలెం వద్ద గ్రామీణ రహదారులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల్లో ఉత్తమ్‌ మాట్లాడుతూ.. గత ప్రభుత్వం పదేళ్ల పాటు నీటిపారుదల శాఖను నిర్వీర్యం చేసిందన్నారు. తెలంగాణను తాకట్టు పెట్టి 1.81 లక్షల కోట్ల రుణాలు తీసుకుని కాళేశ్వరం పేరిట ప్రాజెక్టులను నిర్మించినా ఒరిగిందేమి లేదని విమర్శించారు.


ఐదేళ్ల పాటు సన్నాలకు బోనస్‌..

రైతాంగానికి రానున్న ఐదేళ్ల పాటు కూడా సన్నాలకు క్వింటాలుకు రూ.500 బోనస్‌ ఇస్తామని ఉత్తమ్‌ ప్రకటించారు. నిన్న, మొన్న కట్టిన డ్యామ్‌లు కూలిపోయాయని, బీసీ (బెన్‌ఫిట్‌ కాస్ట్‌ రేషియో) బాగుంటే ఏ ప్రాజెక్టు అయినా చేపడతామన్నారు. ఏ ప్రభుత్వం చేయనంతా ఏడాది కాలంలో తాము చేశామన్నారు. 10 నెలల్లో 55 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని.. రూ.4 వేల కోట్ల విలువ చేసే ప్రయాణాలు ఆర్టీసీ బస్సుల్లో మహిళలు చేశారని వివరించారు. త్వరలోనే కొత్త రేషన్‌కార్డులు మంజూరు చేస్తామని.. సన్న బియ్యం పంపిణీ చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఇప్పటికే ఇందిరమ్మ ఇళ్ల సర్వే ప్రారంభమైందని, ఇళ్లు లేని నిరుపేదలకు ఇళ్లు కూడా మంజూరు చేస్తామన్నారు. శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టులో పూడికతీత చేపట్టి, నిల్వను పునరుద్ధరిస్తామని వెల్లడించారు. రూ.వందల కోట్లతో కృష్ణానదిపై కొత్త ఎత్తిపోతల పథకాలను నిర్మిస్తామని, కృష్ణా జలాలను సద్వినియోగం చేసుకుంటామని చెప్పారు. ప్రాజెక్టుల కింద చివరి ఎకరా వరకు నీరు సరఫరా చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. హుజూర్‌నగర్‌ను రాష్ట్రంలో ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దనున్నట్లు తెలిపారు. ఒక్క ఏడాదిలోనే కోదాడ, హుజూర్‌నగర్‌ నియోజకవర్గాల్లో రూ.500 కోట్లతో గ్రామీణ రహదారులను నిర్మిస్తున్నామన్నారు.

Updated Date - Dec 14 , 2024 | 04:00 AM