ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

DGP Jitender: సవాళ్లను ఎదుర్కొంటేనే ఉత్తమ ఫలితాలు

ABN, Publish Date - Oct 17 , 2024 | 03:49 AM

విధి నిర్వహణలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొంటూ, తప్పులు సరిదిద్దుకుంటూ ఉత్తమ ఫలితాలు సాధించాలని అధికారులు, సిబ్బందికి డీజీపీ జితేందర్‌ సూచించారు.

  • సరైన జాగ్రత్తలతోనే నేరాల ఛేదన: డీజీపీ జితేందర్‌

హైదరాబాద్‌, అక్టోబరు 16 (ఆంధ్రజ్యోతి): విధి నిర్వహణలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొంటూ, తప్పులు సరిదిద్దుకుంటూ ఉత్తమ ఫలితాలు సాధించాలని అధికారులు, సిబ్బందికి డీజీపీ జితేందర్‌ సూచించారు. విధి నిర్వహణలో పోలీసుల అంతిమ లక్ష్యం బాధితులకు చట్టప్రకారం న్యాయం చేయడమే కావాలని పేర్కొన్నారు. తెలంగాణ పోలీస్‌ అకాడమీలో రాష్ట్ర స్థాయి మొదటి పోలీస్‌ డ్యూటీ మీట్‌- 2024 బుధవారం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డీజీపీ హాజరై మాట్లాడారు. పోలీస్‌ డ్యూటీ మీట్‌లో పోటీతత్వం, ఉత్సాహం పెంచుకుని ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సిబ్బందికి సూచించారు.


పోలీస్‌ స్టేషన్‌కు వెళ్తే న్యాయం జరుగుతుందనే నమ్మకం బాధితులకు కల్పించాలని, జాగ్రత్తలు పాటిస్తూ నేరాల ఛేదన చేయాలని ఆయన పేర్కొన్నారు. కేసుల దర్యాప్తులో అధికారులు, సిబ్బంది నైపుణ్యంతో వ్యవహరించాలని సీఐడీ చీఫ్‌ శీఖాగోయల్‌ అన్నారు. టెక్నాలజీని ఆసరాగా చేసుకుని ప్రస్తుత పరిస్థితులకు తగ్గట్లుగా పనిచేయాలని ఆమె సూచించారు. అదనపు డీజీపీ మహేశ్‌ భగవత్‌, అగ్నిమాపక శాఖ డీజీ వై. నాగిరెడ్డి, అకాడమీ డైరెక్టర్‌ అభిలాష బిస్త్‌ సహా పోలీస్‌ ఉన్నతాధికారులు డ్యూటీ మీట్‌లో పాల్గొన్నారు.

Updated Date - Oct 17 , 2024 | 03:49 AM