Janwada Farmhouse: ఫామ్‌హౌస్ పార్టీ కేసులో కీలక పరిణామం..
ABN, Publish Date - Oct 29 , 2024 | 08:59 PM
జన్వాడలోని కేటీఆర్ బామ్మర్ది రాజ్ పాకాల ఫామ్‌హౌస్ పార్టీ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. విజయ్ మద్దూరి ఇంట్లో పోలీసుల తనిఖీలు నిర్వహించారు. ఫామ్ హౌస్ పార్టీలో డ్రగ్స్ తీసుకుని పట్టుబడ్డాడు విజయ్. ఆ సమయంలో తన ఫోన్ ఇవ్వకుండా మరో మహిళ ఫోన్‌ను పోలీసులకు ఇచ్చాడు విజయ్.
హైదరాబాద్, అక్టోబర్ 29: జన్వాడలోని కేటీఆర్ బామ్మర్ది రాజ్ పాకాల ఫామ్‌హౌస్ పార్టీ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. విజయ్ మద్దూరి ఇంట్లో పోలీసుల తనిఖీలు నిర్వహించారు. ఫామ్ హౌస్ పార్టీలో డ్రగ్స్ తీసుకుని పట్టుబడ్డాడు విజయ్. ఆ సమయంలో తన ఫోన్ ఇవ్వకుండా మరో మహిళ ఫోన్‌ను పోలీసులకు ఇచ్చాడు విజయ్. పైగా విజయ్ పోలీసుల విచారణకు హాజరుకాలేదు. పోలీసులకు సైతం ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. దీంతో మోకిల పోలీసులు.. విజయ్ మద్దూరి ఇంట్లో సోదాలు నిర్వహించారు. జూబ్లీహిల్స్‌లోని అతని నివాసంలో పోలీసులు చెక్ చేశారు. విజయ్ ఫోన్ కోసం సెర్చ్ చేశారు.
రెండ్రోజుల క్రితం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బామ్మర్ది రాజ్ పాకాల ఫామ్‌హౌస్‌లో పార్టీ నిర్వహించారు. ఈ పార్టీ విషయం తెలుసుకున్న మోకిల పోలీసులు ఫామ్‌హౌస్‌పై రైడ్ నిర్వహించారు. ఈ తనిఖీల్లో విజయ్ మద్దూరిని టెస్ట్ చేయగా.. కొకైన్ తీసుకున్నట్లు గుర్తించారు. అయితే, ఫోన్ స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించగా.. తన ఫోన్‌కు బదులుగా మహిళ ఫోన్‌ను పోలీసులకు ఇచ్చాడు విజయ్. అతనిపై కేసు కూడా నమోదు చేసిన పోలీసులు. సోమవారం విచారణకు రావాల్సిందిగా ఆదేశించారు. అయితే, పోలీసుల విచారణకు విజయ్ హాజరు కాలేదు. పైగా పోలీసులకు ఎలాంటి సమాచారమూ ఇవ్వలేదు. దీంతో పోలీసులే నేరుగా విజయ్ ఇంటికి వచ్చారు. ఇంట్లో సెర్చ్ చేశారు.
Also Read:
గోల్ఫ్ క్లబ్ ఏర్పాటుపై సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం
ప్రాణాలు పోతున్నా తగ్గలేదుగా..
పదవి కోసం కుటుంబాన్ని చీల్చిందెవరు?
For More Telangana News and Telugu News..
Updated Date - Oct 29 , 2024 | 08:59 PM