Economic Growth: రూ.84 లక్షల కోట్లు!
ABN, Publish Date - Sep 06 , 2024 | 03:20 AM
ఆర్థిక పురోగతి దిశగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారీ లక్ష్యాన్ని నిర్దేశించుకున్నది. 2036 నాటికి రూ.83,98,305 (1 ట్రిలియన్ డాలర్స్) కోట్ల ఆర్థిక వ్యవస్థను సృష్టించాలని నిర్ణయించింది.
2036 నాటికి అంత విలువైన ఆర్థిక వ్యవస్థ సృష్టి
భారీ లక్ష్యాన్ని నిర్దేశించుకున్న రాష్ట్ర ప్రభుత్వం
‘తెలంగాణ గ్రోత్ స్టోరీ’ని ఆవిష్కరించిన సీఎం
2036 నాటికి అంత విలువైన ఆర్థిక వ్యవస్థ
భారీ లక్ష్యాన్ని నిర్దేశించుకున్న ప్రభుత్వం
‘గ్లోబల్ ఏఐ సమ్మిట్’లో ‘తెలంగాణ గ్రోత్ స్టోరీ’ పుస్తకాన్ని ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్, సెప్టెంబరు 5 (ఆంధ్రజ్యోతి): ఆర్థిక పురోగతి దిశగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారీ లక్ష్యాన్ని నిర్దేశించుకున్నది. 2036 నాటికి రూ.83,98,305 (1 ట్రిలియన్ డాలర్స్) కోట్ల ఆర్థిక వ్యవస్థను సృష్టించాలని నిర్ణయించింది. ప్రస్తుతమున్న రాష్ట్ర స్థూల ఉత్పత్తికి(జీఎ్‌సడీపీ) ప్రాథమిక, ద్వితీయ, తృతీయ రంగాల ద్వారా దన్ను కల్పిస్తూ ఈ లక్ష్యాన్ని సాధించనుంది. హైటెక్స్‌లో గురువారం ప్రారంభమైన ‘ప్రపంచ కృత్రిమ మేధ సదస్సు’లో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ‘తెలంగాణ గ్రోత్ స్టోరీ - 2036 నాటికి 1 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ’ అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు.
ఇందులో రాష్ట్ర ప్రగతి ఆకాంక్షలు, ఆర్థిక వృద్ధికి సహకరిస్తున్న ప్రాథమిక, ద్వితీయ, తృతీయ రంగాలు, ఉత్పత్తులు, ఐటీ ఆధారిత సేవలు, ఫార్మాస్యూటికల్స్, లైఫ్‌సైన్సెస్, వ్యవసాయాధారిత ప్రాసెసింగ్ యూనిట్లు తదితర అంశాల గురించి ప్రభుత్వం వెల్లడించింది. దాని ప్రకారం.. 2014లో ఆవిర్భవించిన నాటి నుంచి ఆర్థిక వృద్ధిని సాధిస్తూ వస్తున్న తెలంగాణ.. 2023-24 ఆర్థిక సంవత్సరం నాటికి ప్రస్తుత ధరల వద్ద రూ.14,78,100 కోట్ల (176 బిలియన్ డాలర్లు) జీఎ్‌సడీపీని సాధించింది. ఇదే 2023-24లో స్థూల జాతీయోత్పత్తి(జీడీపీ) రేటుతో పోలిస్తే జీఎ్‌సడీపీ 2.4 శాతం అధికం. రాష్ట్ర తలసరి ఆదాయం కూడా దేశంలోనే అత్యధికంగా రూ.3,49,389 (4160 డాలర్లు)గా నమోదైంది. రంగారెడ్డి జిల్లా అత్యధికంగా రూ.9,46,862 తలసరి ఆదాయంతో రాష్ట్రంలోనే మొదటి స్థానాన్ని ఆక్రమించగా... రూ.4,94,033 తలసరి ఆదాయంతో హైదరాబాద్ ఆ తర్వాతి స్థానంలో నిలిచింది.
Updated Date - Sep 06 , 2024 | 03:20 AM