ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Telangana: పేరు ఉంది.. ఊరే లేదు.. ఏళ్లుగా కనిపించని జనం..

ABN, Publish Date - Oct 25 , 2024 | 10:35 AM

జనం లేని ఊరేమిటని ఆశ్చర్యపోతున్నారా? అక్కడ ఊరు ఉండదు.. కానీ ఊరు ఉన్నట్లు సజీవ సాక్ష్యాలు కనిపిస్తాయి. రెవెన్యూ భూములు కూడా ఆ పల్లె పేరిటే కొనసాగుతున్నప్పటికీ జనం మాత్రం కనిపించరు. తాండూరు మండలం గోనూరు పంచాయతీ అనుబంధ గ్రామంగా ఉన్న మాచనూరుపై ప్రత్యేక కథనం.

తాండూరు రూరల్, అక్టోబరు 25 : తాండూరు మండలంలోని మాచనూరు లక్ష్మీనారాయణపూర్ చౌరస్తా నుంచి బషీరాబాద్ వెళ్లే రోడ్డులో ఉంటుంది. వందల సంవత్సరాల క్రితం మాచనూరు గ్రామంగా ఉండేది. ఇది కుగ్రామంగా ఉండేదని పూర్వీకులు చెబుతుంటారు. కానీ, గ్రామం ఉందని చెప్పడానికి ఆనవాళ్లుగా ఇక్కడ చాలానే గుర్తులు ఉన్నాయి. కోట గోడ, ఆంజనేయస్వామి దేవాలయం, పురాతనకాలం నాటి రావిచెట్టు, బురుజు వంటివి సాక్ష్యాలుగా దర్శనమిస్తున్నాయి.


ఇక్కడ కొనసాగుతున్న ఆశ్రమం..

కర్ణాటక రాష్ట్రానికి చెందిన బీరప్పస్వామి కొన్నేళ్ల క్రితం జనంలేని మాచనూరుకు వచ్చి ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అక్కడ ఉన్న పురాతన కాలం నాటి రావిచెట్టు దగ్గర ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అయితే బీరప్ప స్వామి లింగైక్యం(మరణించడం) పొందారు. దీంతో కర్ణాటక రాష్ట్రం చెంచా ప్రాంతానికి చెందిన శ్రీశ్రీ శివయోగి షీలలింగస్వామి బీరప్ప స్వామి ఇక్కడికి వచ్చి ఆశ్రమాన్ని కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం జనంలేని ఆ ఊళ్లో ఈ ఆశ్రమం కొనసాగుతోంది.


ఎనిమిదేళ్లుగా కొనసాగుతున్న ఆశ్రమం..

‘మాచనూరు గ్రామంలో జనం లేరు. ఇక్కడ బీరప్పస్వామి ఆశ్రమాన్ని ఏర్పాటు చేశారు. ఆయన శివైక్యం చెందిన తర్వాత ఎనిమిదేళ్లుగా నేను ఆశ్రమాన్ని కొనసాగిస్తున్నాను. ఇక్కడ జనం లేకపోయినా ప్రతీ ఆది, మంగళవారాల్లో భక్తులు ఆశ్రమాన్ని సందర్శించేందుకు వస్తుంటారు. ఇక్కడ ఏర్పాట్లు సరిగ్గా లేకపోవడంతో భక్తులు ఇబ్బంది పడుతున్నారు. అయితే కొందరు చుట్టుపక్కల గ్రామస్తుల వారు మా ఆశ్రమానికి రోడ్డు వేసేందుకు కృషి చేస్తామని చెప్పారు.

- శివయోగి షీలలింగ స్వామి బీరప్పస్వామి, మాచనూరు


ఊరు ఖాళీ అయిందిలా..

పురాతన కాలంలో మాచనూరు గ్రామంలో చాలా మంది ప్రజలు ఉండేవారని పెద్దలు చెబుతుంటారు. అయితే గ్రామంలో దొంగల బెడదతో తీవ్రంగా ఇబ్బందులు పడిన జనం ఏం చేయాలో తెలియక ఊరు ఖాళీ చేసేందుకు నిర్ణయించుకున్నారు. అనంతరం ఇళ్లు ఖాళీ చేసి గ్రామాన్ని వదిలి చుట్టు పక్కల ఉన్న గోనూరు, నారాయణపూర్, కాశీపూర్ గ్రామాలకు వెళ్లిపోయినట్లు కొందరు చెబుతున్నారు. కాగా, మాచనూరు రెవెన్యూ గ్రామం పేరిట గోనూరు గ్రామ భూములు 250 ఎకరాల్లో ఉన్నాయి. ప్రస్తుతం ఊర్లో జనం లేకపోయినా రికార్డుల్లో మాత్రం ఇప్పటికీ మాచనూరు పేరునే వ్యవసాయ భూములు రికార్డుల్లో కొనసాగుతున్నాయి.


Also Read:

పక్కా ఆధారాలు.. కీలక నేతల అరెస్ట్‌కు ముహూర్తం ఫిక్స్

షర్మిలపై జగన్‌కు ఎందుకంత ‘పగ’.. అంటే..

వచ్చాడు.. పడగొట్టాడు

For More Telangana News and Telugu News..

Updated Date - Oct 25 , 2024 | 10:35 AM