ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Tummala: ఆయిల్‌పామ్‌ పరిశ్రమ అభివృద్ధికి మలేషియా సహకారం

ABN, Publish Date - Oct 24 , 2024 | 03:14 AM

ఆయిల్‌పామ్‌ పరిశ్రమ అభివృద్ధికి రానున్నకాలంలో ఆయిల్‌పామ్‌ సాగులో అగ్రగామి ఉన్న దేశాల్లో ఒకటైన మలేషియా సహకారం తీసుకోనున్నట్టు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.

  • రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల

హైదరాబాద్‌, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి): ఆయిల్‌పామ్‌ పరిశ్రమ అభివృద్ధికి రానున్నకాలంలో ఆయిల్‌పామ్‌ సాగులో అగ్రగామి ఉన్న దేశాల్లో ఒకటైన మలేషియా సహకారం తీసుకోనున్నట్టు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఆయిల్‌ పామ్‌ విస్తరణావకాశాలు, ప్రాసెసింగ్‌ ప్లాంట్ల నిర్వహణ, సాగులో అనుసరిస్తున్న సాంకేతిక విధానాలు, ఆయిల్‌పామ్‌ ఉత్పాదకాలపై శాస్ర్తీయ అధ్యయనానికి మంత్రి తుమ్మల, వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్‌రావు, ఉద్యానశాఖ డైరెక్టర్‌ యాస్మిన్‌ బాషాలు మలేషియాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా మలేషియా ప్లాంటేషన్‌, కమోడిటీస్‌ మంత్రి జోహరి అబ్దుల్‌ ఘనితో బుధవారం భేటీ అయ్యారు.


పామాయిల్‌ ఉత్పత్తికి అన్ని విధాలా సహాయసహకారాలు అందిస్తున్నామని, త్వరలోనే మలేషియా బృందం తెలంగాణలో పర్యటిస్తుందని తెలిపారు. అనంతరం ఎంఏటీఆర్‌ఏవోఈ చైర్మన్‌ డాటో సెరి రీజల్‌ మెరికన్‌ భేటీతో అయి మలేషియాతో వ్యవసాయపరంగా వ్యాపార అవకాశాలపై చర్చించారు. తమ దేశంలో నూకలకు అత్యంత డిమాండ్‌ ఉందని డాటో చెప్పారు. వెంటనే మంత్రి తుమ్మల... హాకా ఎండీ చంద్రశేఖర్‌ రెడ్డితో ఫోన్‌లో మాట్లాడారు. నూకలు ఎగుమతి చేయడానికి సంబంధించిన అంశాలను పరిశీలించాలని, తెలంగాణ వరి రైతులకు అదనపు ప్రయోజనం కలిగితే వచ్చే యాసంగి సీజన్‌కల్లా ఎగుమతి చేసేందుకు సిద్ధంగా ఉండాలని మంత్రి ఆదేశించారు. అనంతరం మలేషియా పామాయిల్‌ బోర్డును సందర్శించారు. ఎంపీవోబీ చైర్మన్‌ డా.అహ్మద్‌ పర్వేజ్‌ గులామ్‌ఖదీర్‌తో భేటీ అయ్యారు.

Updated Date - Oct 24 , 2024 | 03:14 AM