Anusuyya Seethakka: రైతుల ఆదాయం పెంచేలా ఉపాధి పనులు
ABN, Publish Date - Nov 02 , 2024 | 04:59 AM
రాష్ట్ర రైతుల ఆదాయం పెంచేలా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా పనులు చేపట్టాలని నిర్ణయించినట్లు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ధనసరి అనుసూయ సీతక్క తెలిపారు.
రూ.1,372 కోట్లతో ప్రణాళిక: మంత్రి సీతక్క
హైదరాబాద్, నవంబరు 1 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్ర రైతుల ఆదాయం పెంచేలా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా పనులు చేపట్టాలని నిర్ణయించినట్లు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ధనసరి అనుసూయ సీతక్క తెలిపారు. వ్యవసాయ అనుబంధ పనులకు ప్రాధాన్యం కల్పిస్తూ.. శాశ్వతంగా నిలిచేలా ఉపాధి హామీ పనులు చేపట్టనున్నామన్నారు. ఇందుకుగాను రూ.1,372 కోట్లతో వివిధ పనులు చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు.
మహిళాశక్తి - ఉపాధి భరోసా పేరిట మహిళల స్వయం ఉపాధి కోసం ఉపాధి హామీ నిధులతో 5,400 పశువుల కొట్టాలు, 10,300 అజోలపిట్ల(పచ్చిరొట్ట)ఎరువుల తయారీషెడ్లు, 5,400 వర్మికంపోస్ట్ తొట్ల నిర్మాణం చేపడతామన్నారు. మహిళా స్వయం సహాయక సంఘాలకు మండలానికి ఒకటి చొప్పున మదర్‌యూనిట్ పేరిట 540 కోళ్లషెడ్ల నిర్మాణాన్ని చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఫల వనాల పేరిట 2,700 ఎకరాల్లో చిన్న, సన్నకారు రైతులు పండ్లతోటల పెంపకం ద్వారా ఆదాయం పొందేలా ప్రోత్సహిస్తామన్నారు.
Updated Date - Nov 02 , 2024 | 04:59 AM